దృశ్యం 3పై తెలుగు రీమేక్ పై క్లారిటీ ఇదే!
దృశ్యం 3 తెలుగు వెర్షన్ సస్పెన్స్‌కు తెరపడింది. వెంకటేష్ ఇతర సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటంతో, తెలుగులో త్రీక్వెల్ ఆలోచనను పక్కన పెట్టారు. మలయాళ దృశ్యం 3 డబ్బింగ్ వెర్షన్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నెల 21న విడుదల కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
దృశ్యం 3 తెలుగు వెర్షన్ విడుదలపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. దృశ్యం 1, 2 తో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్ మూడవ భాగంలో నటిస్తారా లేదా అనే సందేహాలు చాలా రోజులుగా అభిమానులను వెంటాడాయి. ఇండియన్ స్క్రీన్ మీద అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో దృశ్యం ఒకటి. మలయాళంలో మొదలై తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ భారీ విజయం సాధించింది. తొలి రెండు భాగాలు సూపర్ హిట్ కావడంతో, త్రీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వెంకటేష్ ప్రస్తుతం ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్, ఆ తర్వాత అనిల్ రావి పూడి సినిమాతో బిజీగా ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
మరో సీజన్ ప్లాన్ చేస్తోన్న..మనీ హెయిస్ట్
Follow Us
