Dhurandhar 2: ధురంధర్ 2 ఆ రోజున వస్తుందా.. రాదా ??

Updated on: Mar 06, 2026 | 4:58 PM

"టాక్సిక్" వాయిదాతో దురంధర్ 2 విడుదలపై సందేహాలు రేకెత్తాయి. మార్చి 19న రిలీజ్ కావలసి ఉన్నా ప్రమోషన్లు లేవు. మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావం దురంధర్ 2పై ఉండదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలి భాగం నిషేధమైనందున ఆ మార్కెట్ అవసరం లేదు. సోలో రిలీజ్ అయితే రికార్డులు బద్దలవడం ఖాయం.

దురంధర్ 2 సినిమా విడుదలపై తీవ్ర అనుమానాలు నెలకొన్నాయి. మార్చి 19న విడుదల కావాల్సి ఉన్నా, ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కాలేదు. “టాక్సిక్” చిత్రం వాయిదా పడటంతో, దురంధర్ 2 కూడా వాయిదా పడుతుందేమోనని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అంత పెద్ద సినిమాకు కనీసం 15 రోజుల ప్రమోషన్లు కూడా అక్కర్లేదా అని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అయితే, “టాక్సిక్” సినిమా వాయిదాకు కారణమైన మధ్యప్రాచ్య ప్రభావం దురంధర్ 2పై ఉండదని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే, దురంధర్ మొదటి భాగాన్ని మధ్యప్రాచ్య దేశాల్లో నిషేధించారు. కాబట్టి, ఆ మార్కెట్ కోల్పోయినా దురంధర్ 2కు ఎలాంటి నష్టం ఉండదు. యుద్ధం కారణంగా ఈ సినిమాను వాయిదా వేసే ప్రసక్తే లేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Toxic: అరె.. టాక్సిక్ సినిమా వాయిదా పడటానికి కారణం అదా..

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. అప్పుల బాధ తట్టుకోలేక

AP Assembly: రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు మరింతగా తగ్గిస్తాం

CM Chandrababu: ప్రపంచం మెచ్చేలా అమరావతిని నిర్మిస్తాం

వాట్సాప్ చాట్‌ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది

Follow Us