బాలీవుడ్ హీరోలకు డేంజర్ బెల్స్.. హీరోలకు పెరుగుతున్న బెదిరింపులు

Updated on: Feb 13, 2026 | 12:56 PM

బాలీవుడ్ హీరోలకు గ్యాంగ్‌ల నుంచి బెదిరింపులు పెరుగుతున్నాయి. తాజాగా రణవీర్ సింగ్‌కు డబ్బు డిమాండ్ చేస్తూ వార్నింగ్ వచ్చింది, దీనిపై పోలీసులు భద్రత పెంచారు. గతంలో దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటిపై దాడి, సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి నిరంతర బెదిరింపులు ఉన్నాయి. నార్త్ ఇండస్ట్రీలో ఈ బెదిరింపుల పర్వం కలకలం రేపుతోంది.

బాలీవుడ్ హీరోలకు గ్యాంగ్‌ల నుంచి బెదిరింపులు పెరుగుతున్నాయి. సినిమాల్లో వందల మందిని ఎదుర్కొనే హీరోలు బయట బెదిరింపులకు గురవుతున్నారు. “చంపేస్తాం, నరికేస్తాం” అంటూ వస్తున్న వార్నింగ్స్ నార్త్ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్‌కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. రణవీర్ సింగ్ ఇటీవల ఒక ఫోన్ కాల్ ద్వారా బెదిరింపు సందేశాన్ని అందుకున్నారు. ఒక వాయిస్ నోట్ రూపంలో వచ్చిన ఈ వార్నింగ్‌లో అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీని వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో రణవీర్ సింగ్ పోలీసులను ఆశ్రయించారు. ముంబైలోని ఆయన నివాసం వద్ద పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్‌ల పహారాను పెంచారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

MLA అరవ శ్రీధర్ – వీణ ఎపిసోడ్ లో కీలక పరిణామం

Botsa Satyanarayana: కూటమి వచ్చాక.. ఒక్క కొత్త పెన్షనూ లేదు

మల్లారెడ్డి యూనివర్సిటీలో శివరాత్రి జాగరణ కార్యక్రమం

Lok Sabha: లోక్ సభ లో.. జగడ జగడ జగడం

విడిపోయాకే సంతోషంగా ఉన్నా.. బాధ లేని బంధం

Loading...
Unable to load recommendations.
Follow Us