డిసెంబర్ 4న బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ క్లాష్
డిసెంబర్ 4న బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్ద పోరుకు రంగం సిద్ధమైంది. సల్మాన్ ఖాన్ నటించిన మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్ చిత్రానికి, శ్రద్ధా కపూర్ ఈటా సినిమా పోటీగా విడుదలవుతున్నాయి. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ రెండు చిత్రాలపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. వీరిద్దరి మధ్య గతంలో ఉన్న ప్రత్యేక అనుబంధం ఈ పోటీకి మరింత ప్రాధాన్యతను సంతరించింది.
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డిసెంబర్ 4న ఒక ఆసక్తికరమైన పోరు జరగనుంది. సల్మాన్ ఖాన్ నటించిన మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్ చిత్రం, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈటా సినిమా ఒకే రోజున విడుదల కానున్నాయి. అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ మాతృభూమిలో కనిపించనుండగా, లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ లో ఈటా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ రెండు చిత్రాలు నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కాయి. మాతృభూమి యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనే సందేశంతో రాగా, ఈటా ప్రముఖ మహారాష్ట్ర తమాషా కళాకారిణి విఠాబాయి నారాయణ్ గవాంకర్ జీవితకథ ఆధారంగా రూపొందింది. శ్రద్ధా కపూర్ గతంలో సల్మాన్ ఖాన్ లక్కీ: నో టైమ్ ఫర్ లవ్ చిత్రంతో పరిచయం చేయాలనే ఆఫర్‌ను తిరస్కరించిన తర్వాత, ఇప్పుడు ఆయనతోనే బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం చర్చనీయాంశంగా మారింది. థియేటర్ల పంపిణీపై మొదట్లో ఆందోళనలు ఉన్నప్పటికీ, పరిశ్రమ వర్గాల ప్రకారం రెండు చిత్రాలకూ తగినన్ని స్క్రీన్‌లు అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 4న బాక్సాఫీస్ వద్ద ఆరోగ్యకరమైన పోటీని చూడవచ్చని అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఫామ్‌లో ఉన్న బ్యూటీస్‌కి తప్పని వెయిటింగ్..
నవంబర్, డిసెంబర్ నెలల్లో బాక్సాఫీస్ పై చిన్న సినిమాల దండయాత్ర
బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రణబీర్ కపూర్ Vs రణవీర్ సింగ్..
రామాయణ తరువాత రాజమౌళి మనసు మార్చుకున్నారా?
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
