Pallavi Prashanth: రైతు బిడ్డ చేసిన ఆ ఒక్క మిస్టేకే.. అతన్ని జైలుపాలు చేసింది

Updated on: Dec 22, 2023 | 9:47 AM

మొన్నటివరకు బిగ్‌బాస్‌ హౌస్‌లో… ఇప్పుడు చంచల్‌గూడ జైల్లో… ఇదీ పల్లవి ప్రశాంత్‌ ప్రస్తుత పరిస్థితి. బిగ్‌బాస్‌ ఫైనల్‌ రోజున హైదరాబాద్‌ రోడ్లపై విధ్వంసానికి, అల్లర్లకు కొంతమేర కారణమైన పల్లవి ప్రశాంత్‌‌ను పోలీసులు జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్‌చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. పల్లవి ప్రశాంత్‌పై మొత్తం 9 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయ్‌.

మొన్నటివరకు బిగ్‌బాస్‌ హౌస్‌లో… ఇప్పుడు చంచల్‌గూడ జైల్లో… ఇదీ పల్లవి ప్రశాంత్‌ ప్రస్తుత పరిస్థితి. బిగ్‌బాస్‌ ఫైనల్‌ రోజున హైదరాబాద్‌ రోడ్లపై విధ్వంసానికి, అల్లర్లకు కొంతమేర కారణమైన పల్లవి ప్రశాంత్‌‌ను పోలీసులు జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్‌చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. పల్లవి ప్రశాంత్‌పై మొత్తం 9 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయ్‌. ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడు రాజు, మరికొందరిపై కేసులు పెట్టారు పోలీసులు. దాంతో, బిగ్‌బాస్‌ విన్నర్‌గా బయటకు అడుగులు వేసిన ప్రశాంత్‌ ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటివరకు జేజేలు పలికిన వాళ్లే… ఇదేం పని ప్రశాంత్‌ అనే పరిస్థితికి చేరుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఎంత డ్రామా ఉంటుందో… టైటిల్‌ గెలిచిన తర్వాత అంతకుమించిన హైడ్రామా నడిచింది. పల్లవి ప్రశాంత్‌ అరెస్ట్‌ విషయంలో కూడా పెద్ద డ్రామా జరిగింది. చివరికి బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఓన్‌ హౌస్‌కి వెళ్లిన పల్లవిని… ఇప్పుడు జైలర్‌ హౌస్‌కి తరలించారు పోలీసులు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salaar Public Talk: సలార్ మూవీ పబ్లిక్‌ టాక్‌.. ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే ??

Loading...
Unable to load recommendations.
Follow Us