Rohith Naidu: హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంపై.. రోహిత్ నాయుడు నుంచి కీలక నోట్!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 నుంచి ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయిన రోహిత్ నాయుడు తన రీఎంట్రీపై స్పష్టత ఇచ్చారు. తాను మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడం లేదని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు అభిమానులు అందించిన ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ, బిగ్‌బాస్ ప్రయాణం ముగిసినా వారితో తన బంధం కొనసాగుతుందని భావోద్వేగ సందేశం ఇచ్చారు.
బిగ్‌బాస్ సీజన్-10 కంటెస్టెంట్ రోహిత్ నాయుడు తనదైన ఆట తీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రారంభ వారాల్లో టాస్కుల్లో అద్భుతంగా రాణించిన ఆయన, ఆ తర్వాత కొద్దిగా జోరు తగ్గించారు. హౌస్‌లో షాలినితో క్లోజ్‌గా ఉండటం, కొన్ని గేమ్‌లలో వెనుకబడటం వల్ల తరచూ నామినేషన్లలో నిలిచారు. ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి గొడవపడటంతో కొంత నెగెటివిటీని కూడా మూటగట్టుకున్నారు. అయితే ప్రేక్షకుడి ఓట్ల ద్వారా కాకుండా, హౌస్మెట్స్ ఓటింగ్ ఆధారంగా ఊహించని ట్విస్ట్ ఇస్తూ.. రోహిత్‌ను 8వ వారంలో బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఎలిమినేట్ అయిన రోజు స్టేజ్‌పై ఎలాంటి జర్నీ వీడియో చూపించకపోవడంతో, అప్పటి నుంచి ఆయన అభిమానులు రోహిత్ మళ్లీ హౌస్‌లోకి రీఎంట్రీ ఇస్తాడంటూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పలు ఫేక్ వీడియోలను కూడా వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అంచనాలకు తెరదించుతూ రోహిత్ సోషల్ మీడియా వేదికగా ఒక కీలక నోట్ విడుదల చేశారు. తాను ఎలిమినేట్ అయిన రోజుతోనే తన బిగ్‌బాస్ ప్రయాణం పూర్తిగా ముగిసిందని ఆయన స్పష్టం చేశారు. చాలా స్పష్టంగా చెప్పాలంటే హౌస్‌లోకి ఎలాంటి రీఎంట్రీ ఉండదని తేల్చిచెప్పారు. తన అభిమానులు తనపై కురిపించిన అపారమైన ప్రేమ, మద్దతును చూశాక తనకు మళ్లీ హౌస్‌లోకి వెళ్లాలనే ఒక ఆశాకిరణం కనిపిచిందని పేర్కొన్నారు. కానీ, విధికి వేరే ప్రణాళికలు ఉన్నాయని తాను గట్టిగా నమ్ముతానని తెలిపారు. బహుశా బిగ్‌బాస్ హౌస్‌లో తన ప్రయాణం అక్కడితో ముగిసి ఉండవచ్చునని, కానీ తాను ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటూనే ఉంటానని అన్నారు. ఆట ముగిసి ఉండవచ్చు కానీ మన మధ్య ఉన్న ఈ బంధం శాశ్వతం అని ఆయన పేర్కొన్నారు. తనకు అండగా నిలిచి, తన ప్రయాణాన్ని ఎప్పటికీ మరపురానిదిగా చేసిన ప్రతి ఒక్కరికీ రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ramayana: సీత యోధురాలే.. నా రామాయణ నిజమే! సాక్ష్యాలతో విమర్శకుల నోళ్లు మూయించిన డైరెక్టర్
సినిమా కోసం.. అమెరికాలో IT జాబ్‌కి రిజైన్! ఇంట్రెస్టింగ్గా సాత్విక స్టోరీ!
Temper Vamsi: టెంపర్ వంశీని బిగ్ బాస్‌లో ఉంచేందుకు.. పూరీ జగన్నాథ్ రోజూ కష్టపడుతున్నాడట!
