Temper Vamsi: టెంపర్ వంశీని బిగ్ బాస్‌లో ఉంచేందుకు.. పూరీ జగన్నాథ్‌ రోజూ కష్టపడుతున్నాడట!

Updated on: Nov 17, 2026 | 4:52 PM

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో టెంపర్ వంశీకి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ మద్దతుగా నిలుస్తున్నారని నటుడు ఆలీ వెల్లడించారు. వంశీ కోసం పూరి జియో హాట్‌స్టార్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ప్రతిరోజూ ఓటింగ్ చేస్తున్నారని బిగ్‌బాస్ వేదికపై చెప్పారు. దీంతో ఆలీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వంశీకి మద్దతు కూడా పెరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆసక్తికరంగా, హోరా హోరీగా సాగుతోంది. ఇప్పటికే ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది. పదో వారం ఫ్యామిలీ వీక్ నడిచింది. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి సందడి చేశారు. తమ వారికి ధైర్యం చెప్పారు. అలాగే బిగ్ బాస్ టైటిల్ తో తిరిగి రావాలని కోరారు. ఇక వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా కొందరు సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు.అందులో భాగంగానే ప్రముఖ స్టార్ కమెడియన్ ఆలీతోపాటు ఆయన సతీమణి జుబేదా కూడా బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు.ఈ సందర్భంగా అలీ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అందరితో పంచుకున్నారు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టెంపర్ వంశీకి ఫుల్ సపోర్టుగా ఉన్నారని చెప్పి.. వంశీకి ఫుల బూస్ట్ ఇచ్చారు. వంశీ కోసం.. పూరీ జగన్నాథ్ గారు జియో హాట్ స్టార్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని మరీ.. ప్రతిరోజు నీకు ఓటింగ్ చేస్తున్నారంటూ అలీ బిగ్ బాస్ షో వేదికగా చెప్పేశారు. దీంతో ఈ విషయం కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దాంతో పాటే వంశీకి సోషల్ మీడియాలో సపోర్ట్ కూడా బాగా పెరుగుతూ వస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం టెంపర్. 2015 లో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలోనే విలన్ ప్రకాశ్ రాజ్ సోదరుగా నటించాడు వంశీ. ఇందులో అతని నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా తర్వాతే.. మనోడి పేరు ముందు టెంపర్ చేరింది. అలా వంశీ కాస్తా.. టెంపర్ వంశీగా మారిపోయాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రి Vs కొడుకు.. బాక్సాఫీస్ వద్ద విచిత్ర పోరు!

Chiranjeevi: ఆ నీఛులపై.. గురి పెట్టిన మెగాస్టార్

Ashu Reddy: పెళ్లి గిల్లీ సెట్టవ్వవు.. అప్పట్లో తాగేదాన్ని కానీ ఇప్పుడు..

Loading...
Unable to load recommendations.
Follow Us