మాట తప్పిన మాధురి.. సార్ మాట కాదని వెస్ట్రన్ బట్టల్లో

Updated on: Oct 17, 2025 | 4:48 PM

బిగ్ బాస్ సీజన్‌9 లో వైల్డ్ కార్డ్‌ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన దివ్వెల మాధురి తన దైన స్ట్రాటజీతో హౌస్‌లో దూసుకుపోతోంది. తన మాటతో.. హౌస్‌ను షేక్ చేయడమే కాదు.. టాస్కుల్లోనూ యాక్టివ్‌గానే పార్టిసిపేట్ చేస్తోంది. దీంతో ఈమె బీబీ ఫ్యాన్స్‌కు ఫెవరెట్ ప్లేయర్‌గా మారుతోంది. ఇక మరో వైపు దువ్వాడ శ్రీనివాస్‌ కూడా.. మాధురికి తన వంతు సాయం చేస్తున్నాడు.

బయట నుంచి మాధురికి సోషల్ మీడియాలో ప్రచారం కల్పిస్తున్నాడు. ఈక్రమంలోనే రీసెంట్‌గా టీవీ9తో మాధురి ఆట గురించి ఆయన మాట్లాడారు. అలా మాట్లాడుతున్న క్రమంలోనే చీర కట్టులో.. నిండైన తెలుగుతనంతో మాత్రమే మాధురి బిగ్ బాస్‌లో కనిపిస్తుంది.. కంటిన్యూ అవుతుందని శ్రీనివాస్ చెప్పారు. తను ఇదే చెప్పి పంపించా అంటూ చెప్పుకొచ్చారు. అయితే శ్రీనివాస్‌కిచ్చిన ఈ మాటనే ఇప్పుడు మాధురి దాటేసింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. రీసెంట్ ఎపిసోడ్‌ అయిన 39th ఎపిసోడ్‌లో… బుజ్జిగాడు సాంగ్‌తో నిద్రలేచిన కంటెంస్టెంట్ అందరూ.. లాన్‌లో వచ్చి డ్యాన్స్‌ చేస్తూ ఉండగా.. కాస్త లేట్‌గా హౌస్‌ నుంచి బయటికి వచ్చింది దివ్వెల మాధురి. అయితే అలా హౌస్‌ నుంచి బయటికి వచ్చిన ఆమె.. చీరలో కాకుండా నైట్‌ సూట్‌లో కనిపించింది. దీంతో ఈఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొంత మంది శ్రీనివాస్‌ను ట్రోల్ చేస్తున్నారు. మాట తప్పిన మాధురి అంటూ.. కామెంట్ చేస్తున్నారు. శ్రీనివాస్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలంటూ పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎంకి పెళ్ళి సుబ్బి చావు అంటే ఇదే.. పాపం మాధురి దెబ్బకి నలిగిపోతున్న భరణి

మమిత – క్రికెటర్‌ గిల్ మధ్య ఇలా లింకు పెట్టారేంట్రా ??

వీళ్లవి నోళ్లు కాదు మైకు సెట్లు.. రీతూ – ఆయేషా గొడవతో.. అందరికీ తలనొప్పి

Mithra Mandali: చాలా కష్టపడి నవ్వాలి! హిట్టా..? ఫట్టా..?

ఏదేమైనా రచ్చ గెలవాల్సిందే .. దిల్ రాజు మాస్టర్ ప్లాన్

Published on: Oct 17, 2025 04:47 PM