
అషూరెడ్డి..! టిక్‌టాక్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్‌తో సోషల్ మీడియాలో జూనియర్ సమంతగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్‌గా అడుగుపెట్టి తన ట్యాలెంట్ చూపించింది. గతంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ.. రీసెంట్గా తాను జీవింతంలో పెళ్లి చేసుకోనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దాంతో పాటే తన డ్రింకింగ్ అలవాటు గురించి కూడా చెప్పుకొచ్చింది. ఓ షోలో పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటని ఆషూను హోస్ట్ అడగ్గా.. థూ అని ఉమ్మేసి అందర్నీ షాకయ్యేలా చేసింది ఆషురెడ్డి. ‘ప్రేమ, పెళ్లి అనేవి నా మైండ్‌లోనే కాదు మనసులో కూడా లేవు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా వస్తే అప్పుడు చూస్తాను’ అని చెప్పుకొచ్చింది అషూరెడ్డి. ఇక డ్రింకింగ్ అలవాటు గురించి మాట్లాడుతూ.. ‘ బ్యాడ్ పీపుల్‌తో ఏదైతే జర్నీ చేశానో అప్పుడు డ్రింకింగ్ అలవాటు ఉండేది. అయితే తాగి నా ఆరోగ్యం పాడుచేసుకోవాలనుకోవట్లేదని కొన్నాళ్లకు నాకు అర్థమైంది. అప్పుడే ఆపేసి రోజూ జిమ్‌కి వెళ్లడం మొదలుపెట్టాను. ఎందుకంటే మన శరీరమే మనకు దేవాలయం. దాన్ని నువ్వు బాగా చూసుకుంటే అది ఎప్పటికైనా నిన్ను కాపాడుతుంది. ఈ ఆలోచన రాకముందు వరకుతాగేదాన్ని’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దాంతో పాటే గతంలో ఆషురెడ్డి పెళ్లి పేరుతో మోసం చేసిందనే న్యూస్‌ను కూడా కొంత మంది నెటిజన్లు బయటికి తీసి.. ఈమెను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉప్పు రేణువును 8 ముక్కలు చేశాడా? AI మాయాజాలమా లేక నిజమైన టాలెంటా
భూమి వేడెక్కుతున్నా చలి తగ్గలేదెందుకు? వాతావరణంలో విచిత్రమైన మార్పులకు కారణమేంటి?
భార్యను గొలుసులతో బంధించి..! భర్త చేసిన దారుణాన్ని చూస్తే షాక్! అసలేం జరిగింది?
ఇద్దరు తండ్రులు.. రెండు కన్నీటి కథలు.. ఒకరి కూతురి మందులు.. మరొకరి కుటుంబం ఆకలి
హైదరాబాద్ నెంబర్ 1.. ఢిల్లీ, బెంగళూరుది బ్యాక్ బెంచ్.. అసలు నిజమేంటి?