A. R. Rahman: 30 ఏళ్ళ తర్వాత ఆ సినిమాతో తెలుగు లోకి అడుగుపెడుతున్న రెహ్మాన్
ఏఆర్ రెహ్మాన్ ఇన్నాళ్లూ హిందీ, తమిళ చిత్రాలకే పరిమితమని అనుకున్నా, ఇప్పుడు లెక్క మారుతోంది. 30 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. రామ్ చరణ్ 'పెద్ది'తో పాటు చిరంజీవి, విజయ్ దేవరకొండ సినిమాలకూ సంగీతం అందిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సంగీతాన్ని అందించేందుకు రెహ్మాన్ వేగం పెంచారు.
ఏఆర్ రెహ్మాన్ అంటే ఇన్నాళ్లూ ఎక్కడో బాలీవుడ్‌లో ఉంటారు.. అప్పుడప్పుడూ సౌత్ సినిమాలు చేస్తుంటారు.. అవి కూడా తమిళంలో మాత్రమే అనుకునేవాళ్లు. కానీ లెక్కలన్నీ మారుతున్నాయిప్పుడు. టాలీవుడ్‌ని సీరియస్‌గా తీసుకుంటున్నారీయన. 30 ఏళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తున్నారు రెహ్మాన్. మరి ఆయన దూకుడుపై ఓ లుక్ వేద్దామా..? ఏఆర్ రెహ్మాన్ అంటే పూర్తిగా హిందీ, తమిళ సినిమాలకు మాత్రమే అంకితమైపోయారనే టాక్ ఉండేది ఇన్నాళ్లూ. గత 30 ఏళ్లలో పట్టుమని అరడజన్ తెలుగు సినిమాలు కూడా చేయలేదు రెహ్మాన్. కానీ ఉన్నట్లుండి ఇప్పుడు జోరు పెంచేసారీయన. ఆల్రెడీ రామ్ చరణ్ పెద్ది సినిమాకు సంగీతం అందిస్తున్నారు రెహ్మాన్. దీని వర్క్స్ అన్నీ వేగంగా నడుస్తున్నాయి. పెద్ది నుంచి విడుదలైన చికిరీ సాంగ్ 100 మిలియన్లు దాటిపోయింది. రంజాన్ మాసం మొదలయ్యే ముందే పెద్ది వర్క్ పూర్తి చేయాలని చూస్తున్నారు రెహ్మాన్. బాబీ, చిరంజీవి సినిమాకు కూడా రెహ్మాన్ పేరే వినిపిస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి మొదలు కానుంది. గతంలో సైరాతో పాటు రెండుసార్లు చిరు సినిమాకు రెహ్మాన్ వర్క్ చేసే ఛాన్స్ మిస్సైంది. విజయ్ దేవరకొండ, మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ కాంబినేషన్‌లో యువీ క్రియేషన్స్ ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. దీనికి కూడా సంగీత దర్శకుడిగా AR రెహ్మాన్ పేరే వినిపిస్తుంది. మొత్తానికి 30 ఏళ్లుగా టాలీవుడ్ వైపు చూడని రెహ్మాన్.. ఆ బాకీ అంతా ఇప్పుడే తీర్చేస్తున్నారు. ఈయన స్పీడ్‌తో మిగిలిన వాళ్లకు పోటీ తప్పదేమో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసింది వాళ్లేనా
గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా ?? లేదా ??
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి రూ. 1.50 లక్షల టోకరా.. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్.. అతడిలా కోటికి ఒక్కరుంటారు