అమ్మాయిలతో న్యూడ్ వీడియోకాల్…! తాను అలాంటి వాడిని కాదంటూ నటుడు ఎమోషనల్

Updated on: Oct 23, 2025 | 1:52 PM

తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు అజ్మల్ అమీర్ పై సంచలన ఆరోపణలు వచ్చాయి. అమ్మాయిలతో అతను అసభ్యకరంగా ఛాటింగ్ చేశాడంటూ, వీడియో కాల్స్ కూడా మాట్లాడాడంటూ ఈ నటుడిపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్ నెట్టింట వైరలవుతోంది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను చూసి నిజమనుకుంటున్నారు.

దీంతో స్వయంగా అజ్మల్ రంగంలోకి దిగాడు. సోషల్ మీడియాలో వైరలవుతోన్న వీడియో క్లిప్ పై రియాక్టయ్యాడు. తను పోస్ట్ చేసిన లేటెస్ట్ వీడియోలో.. అవన్నీ ఏఐ సాయంతో క్రియేట్ చేసిన ఫేక్‌ వీడియో కాల్స్‌ అని కొట్టిపారేసిన అజ్మల్… ఈ కల్పిత కథలు, ఏఐ వాయిస్‌ ఇమిటేటింగ్‌, ఎడిటింగ్స్‌.. తనను కానీ, తన కెరీర్‌ను కానీ నాశనం చేయలేవంటూ చెప్పాడు. ఆ భగవంతుడి దయ వల్ల తెలుగు, తమిళ రెండు పెద్ద సినిమా ఇండస్ట్రీలలో తానేంటో నిరూపించుకోగలిగానని.. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని సినీ పరిశ్రమలో కొనసాగుతున్నానంటూ చెప్పాడు. అంతేకాదు తన ఇమేజ్‌ను కాపాడేందుకునేందుకు తనకు మేనేజర్‌ లేడని.. పీఆర్ టీమ్‌ అసలే లేదంటూ చెప్పుకొచ్చాడు. ‘గత రెండు రోజులుగా నా గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో నాకు అండగా నిలబడ్డ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీవల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. మీరే నా ధైర్యం’ అంటూ తన వీడియోలో చెప్పుకొచ్చాడు ఈ స్టార్ నటుడు. ఇక రంగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అజ్మల్ అమీర్. ఆ తర్వాత రచ్చ, అభినేత్రి2, వ్యూహం, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, బడ్డీ, గోట్‌ సినిమాలతో ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. ముఖ్యంగా వ్యూహం, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలు పోషించి తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైపోయాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss Telugu 9: ఆ ఇద్దరి పులిహోర పంచాయితీలో..ఎరక్కపోయి ఇరుక్కున్న రమ్య

Samantha: దీపావళి వేడుకల్లోనూ ఆ వ్యక్తి పక్కనే.. హాట్ టాపిక్ గా సమంత తీరు

Renu Desai: సన్యాసిగా మారాలని ఉంది.. రేణూ షాకింగ్ కామెంట్స్