Vishnupriya: విష్ణుప్రియపై ఫిర్యాదు.. మరోసారి వివాదంలో చిక్కుకున్న యాంకర్

Updated on: Apr 13, 2026 | 5:27 PM

యాంకర్ విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలపై విజయవాడ సైబర్ క్రైమ్‌ పీఎస్ లో ఏఐఎస్ఎఫ్ నేతలు ఫిర్యాదు చేశారు. సబ్‌స్క్రిప్షన్ పేరుతో అడల్ట్ కంటెంట్‌ను ప్రమోట్ చేస్తూ, యువతను పెడదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

యాంకర్ విష్ణుప్రియపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఏఐఎస్ఎఫ్ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రముఖ యాంకర్, నటి విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అడల్ట్ కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పేరుతో అసభ్యకర వీడియోలను పంపి, డబ్బులు వసూలు చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నేతలు తమ ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఆమె వ్యవహారశైలి యువతను, విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, వారిని రెచ్చగొట్టి, పెడదోవ పట్టిస్తోందని ఏఐఎస్ఎఫ్ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేయాలని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా కేసు నమోదు చేయాలని విజయవాడ సైబర్ క్రైమ్ పీఎస్ లో ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు పోలీసులను డిమాండ్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంగారం లాంటి అవకాశాలను చేజార్చుకున్న టాలీవుడ్ దర్శకులు

ముంచేస్తున్న IPL.. భయపడుతున్న మేకర్స్

పొంగల్ పోటీ చూసారా.. ఈసారి దండయాత్రే..

Srinidhi Shetty: హిట్ లేకున్నా శ్రీనిధికి బంపర్ ఆఫర్స్

Shahrukh Khan: పలకరించబోయిన షారుఖ్‌.. పట్టించుకోని రణ్‌వీర్‌

Follow Us