ఈ కంపు భరించలేకపోతున్నా.. విషం ఇచ్చి చంపేయండి! జడ్జికి మొరపెట్టుకున్న స్టార్ హీరో

Updated on: Sep 11, 2025 | 7:47 PM

రేణుక స్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు ఈసారి జైలులో ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు అందడం లేదు. దీంతో ఈ హీరో ఇప్పుడు జైలులో పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరో జడ్జితో ఓ షాకింగ్ అభ్యర్థన చేశాడు. కన్నడ మరో సారి హాట్ టాపిక్ అవుతున్నాడు ఈ హీరో. రేణుకస్వామి హత్య కేసులో దర్శన్ గత సంవత్సరం అరెస్టయ్యాడు.

ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే సుప్రీంకోర్టు నటుడి బెయిల్‌ను రద్దు చేసింది. అలాగే జైలులో అతనికి ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించకూడదని కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దర్శన్‌ను బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంచారు. కోర్టు ఆదేశాల అనుసారం అతనికి ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదు జైలు అధికారులు. దీంతో ఒకప్పుడు స్టార్ హీరోగా లగ్జరీ లైఫ్ అనుభవించిన దర్శన్ ఇప్పుడు ఓ సామాన్య ఖైదీగా జైలులో మగ్గుతూ ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే దర్శన్ బెంగళూరులోని 57వ CCH కోర్టులో..ఓ అభ్యర్థన చేశాడు. అదనపు దిండు, బెడ్‌షీట్ కోసం దరఖాస్తు దాఖలు చేశాడు. అయితే ఈ దరఖాస్తు సెప్టెంబర్ 09 విచారణకు వచ్చింది. వీడియో కాల్ ద్వారా విచారణకు హాజరయిన దర్శన్… విచార ముగుస్తుందనగా.. నాదో రిక్వెస్ట్ సార్ అంటూ జడ్జిని అడిగాడు. దీనికి స్పందించిన జడ్జీ ఏమిటని అడగగా.. తన సమాధానంతో న్యాయమూర్తితో పాటు అందరినీ షాక్‌ అయ్యేలా చేశాడు. “సూర్యోదయాన్ని చూసి నెల రోజులకు పైనే అవుతుంది. ఎండ అన్నది చూడడం లేదు. దీంతో నా చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేశాయి. బట్టలు కంపు కొడుతున్నాయి. ఇలా నేను బతకలేను. ఒక్క చుక్క విషం ఇవ్వండి నేను చనిపోతా. నా జీవితం అత్యంత దుర్భరంగా తయారైంది” అని దర్శన్ న్యాయమూర్తి ముందు విలపించాడు. దీనిపై స్పందించిన జడ్జి.. ‘అలాంటివి మీరు అడగకూడదు. ఇది జరగదు. మీ గురించి జైలు అధికారులకు మేము ఇవ్వాల్సిన ఆదేశాలు ఇస్తాం’ అని చెప్పి విచారణను వాయిదా వేశారు న్యాయ మూర్తి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Teja Sajja: ఆ పెద్ద దర్శకుడు.. నన్ను వాడుకొని వదిలేశాడు..

మల్లెపూలకే లచ్చ ఫైను.. ఎయిర్ పోర్టులో హీరోయిన్ కు వింత అనుభవం

TOP 9 ET: కాంబో ప్యాక్.. కాంతార టికెట్ కొంటే ప్రభాస్ మూవీ ట్రైలర్ ఫ్రీ | AA 22 నుంచి అనుకోని అప్‌డేట్

రూటు మార్చిన నాగ వంశీ.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో.. ఆంజనేయుడి యానిమేషన్ మూవీ

‘డాక్యుమెంటరీనే కాదు డబల్ హెడేక్‌’ చిక్కుల్లోకి నయన్‌.. హైకోర్టుకు కొత్త నోటీసులు