Cyclone Threat: 48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!

|

Oct 21, 2024 | 9:59 AM

ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పట్లో వర్షాలు వదిలేలా లేవు. ఇప్పటికే అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలను భారీవర్షాలు ముంచెత్తాయి. ఇప్పడిప్పుడే వర్షాలనుంచి కోలుకుంటున్న సమయంలో వాతావరణశాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. 48 గంటల్లో మరో వాయుగుండం ఏర్పడనుందని ప్రకటించింది. ఆదివారం నాటికి ఉత్తర అండమాన్ సముద్రంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని,

ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి.. వాయుగుండంగా మారుతుందని తాజా బులెటిన్‌లో భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఈ వాయుగుండం ఏపీ నుంచి పశ్చిమ బెంగాల్ మధ్య ఎక్కడైనా తీరం దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తర్వాత రెండు రోజులపాటు ఉత్తరకొస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 24వ తేదీ తర్వాత ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు అవకాశముందని వెల్లడించారు. రాగల రెండు మూడు రోజుల్లో ఏపీలో కొన్ని జిల్లాల్లో తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఐఎండి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on