టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !

Updated on: May 08, 2026 | 1:01 PM

కార్లలో లగ్జరీ ఫీచర్‌గా మారిన సన్‌రూఫ్‌లు వేసవి వేడికి పగిలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 'థర్మల్ స్ట్రెస్', 'థర్మల్ షాక్' ప్రధాన కారణాలు. ఎండలో పార్క్ చేయడం, వేడెక్కిన కారులో ACని వెంటనే ఆన్ చేయడం వల్ల అద్దం పేలుతుంది. నీడలో పార్క్ చేయడం, AC నెమ్మదిగా వాడటం, అద్దంపై గీతలను రిపేర్ చేయించడం వంటి జాగ్రత్తలతో సన్‌రూఫ్‌ను కాపాడుకోవచ్చు.

ప్రస్తుతం కార్లలో సన్‌రూఫ్ అనేది ఒక క్రేజీ లగ్జరీ ఫీచర్‌గా మారింది. అయితే, భానుడి భగభగలకు ఈ సన్‌రూఫ్ అద్దాలు దానంతట అవే ‘ఫట్‌ఫట్’ మంటూ పేలిపోతుండటం ఇప్పుడు వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎవరూ రాయి విసరకపోయినా, ఎటువంటి ప్రమాదం జరగకపోయినా అద్దం ముక్కలవ్వడానికి ప్రధాన కారణం ‘థర్మల్ స్ట్రెస్’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కారును నేరుగా ఎండలో పార్క్ చేసినప్పుడు లోపల ఉష్ణోగ్రత 120 డిగ్రీల ఫారెన్‌హీట్ దాటిపోతుంది. సన్‌రూఫ్ గ్లాస్ ఈ వేడిని నేరుగా గ్రహించి వ్యాకోచిస్తుంది. అద్దం అంచులు, మధ్య భాగం వేర్వేరు వేగంతో వేడెక్కడం వల్ల ఏర్పడే ఒత్తిడికి గ్లాస్ తట్టుకోలేక పేలిపోతుంది. తయారీ సమయంలో ఉండే చిన్నపాటి లోపాలు లేదా అప్పటికే ఉన్న చిన్నచిన్న పగుళ్లు ఎండ తీవ్రతకు పెద్దవిగా మారి అద్దం బ్లాస్టవుతుంది. ఎండలో బాగా వేడెక్కిన కారులోకి రాగానే ఏసీని ఒక్కసారిగా ఫుల్ స్పీడ్‌లో ఆన్ చేయడం వల్ల ‘థర్మల్ షాక్’ కలుగుతుంది. బయటి భాగం వేడిగా, లోపలి భాగం ఒక్కసారిగా చల్లగా మారడంతో అద్దంపై ఒత్తిడి పెరిగి అది ముక్కలవుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు కారును నీడలో పార్క్ చేయాలి. కారు స్టార్ట్ చేయగానే ఏసీని ఫుల్ స్పీడ్‌లో కాకుండా, కిటికీలు కొద్దిగా దించి లోపలి వేడి గాలి బయటకు వెళ్లాక నెమ్మదిగా పెంచండి. సన్‌రూఫ్ అద్దంపై చిన్న గీతలు గానీ, చిప్స్ ఉన్నా వెంటనే రిపేర్ చేయించండి. ఎండలో సెగలు కక్కుతున్న కారుపై ఒక్కసారిగా చల్లటి నీళ్లు పోయడం అత్యంత ప్రమాదకరం. ఖరీదైన సన్‌రూఫ్ అద్దాన్ని కాపాడుకోవాలంటే ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా

ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు

లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి..

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

Follow Us