కొట్టేసిన చీరలను తిరిగి కొరియర్‌లో పంపిన దొంగలు.. అసలేం జరిగిందంటే!
తమిళనాడులో దొంగతనం చేసిన ఖరీదైన పట్టుచీరలను దొంగలే కొరియర్ ద్వారా తిరిగి పంపిన విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపంలోని సెవూరు గ్రామంలో ఓ వ్యాపారి దుకాణం నుంచి 32 పట్టుచీరలు చోరీ అయ్యాయి. సీసీటీవీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, ఈ ఘటన వార్తల్లో రావడంతో భయపడిన నిందితులు చీరలను పార్శిల్‌లో ప్యాక్ చేసి యజమానికి పంపినట్లు తెలుస్తోంది.
దొంగతనం చేసిన వస్తువు దొరకడమే కష్టం, అలాంటిది దొంగలే స్వయంగా కొరియర్ చేసి పంపితే? తమిళనాడులో సరిగ్గా ఇలాంటి విచిత్ర సంఘటనే జరిగింది. చోరీ చేసిన ఖరీదైన పట్టుచీరలకు సంబంధించిన వార్తలు టీవీలు, పత్రికల్లో ప్రసారం కావడంతో భయపడిన దొంగలు.. వాటిని తిరిగి యజమానికే కొరియర్ ద్వారా పంపించేశారు. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపంలో ఉన్న సెవూరు గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. స్థానిక సుబ్రహ్మణ్య స్వామి ఆలయ వీధిలో కుమార్ అనే వ్యాపారి పట్టుచీరల దుకాణం నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం, తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబరు ఉన్న ఒక లగ్జరీ కారులో నలుగురు మహిళలతో సహా ఆరుగురు వ్యక్తులు కస్టమర్లలా ఆయన షాపునకు వచ్చారు. అక్కడ ఉన్న ఖరీదైన పట్టుచీరలను పరిశీలించిన ఆ ముఠా, కేవలం కొన్ని తక్కువ ధర కలిగిన చీరలను మాత్రమే కొనుగోలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. రెండు రోజుల తర్వాత దుకాణంలో లెక్క చూసుకోగా ఖరీదైన పట్టుచీరలు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన కుమార్ షాపులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కస్టమర్స్‌లా వచ్చిన ఆ ఆరుగురి ముఠాయే ఈ చీరలను అత్యంత తెలివిగా దొంగిలించినట్లు స్పష్టమైంది. వెంటనే ఆయన ఆరణి తాలుకా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు, కథనాలు స్థానిక మీడియా మరియు మీడియా ఛానళ్లలో విపరీతంగా ప్రసారమయ్యాయి. మీడియాలో ఈ వార్త బాగా వైరల్ కావడంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ దొంగల ముఠా వినూత్నంగా ఆలోచించింది. చోరీ చేసిన 32 ఖరీదైన పట్టుచీరలను ఒక పార్శిల్‌లో ప్యాక్ చేసి, కొరియర్ ద్వారా నేరుగా వ్యాపారి కుమార్ చిరునామాకే తిప్పి పంపింది. పార్శిల్‌ను చూసి ఆశ్చర్యపోయిన కుమార్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు ఆ కొరియర్ పార్శిల్ ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఎవరు బుక్ చేశారనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం.. ఇదే అసలైన సంస్కారం అంటూ..
కేతన్ హత్య కేసులో సంచలన విషయాలు.. చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు!
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. రూ.1కే 24 రోజులు ఉచిత కాల్స్
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో బెడిసికొట్టిన పులి ప్లాన్
