పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలుకు మాస్టర్‌ ప్లాన్‌.. ఇక ఎవరూ తప్పించుకోలేరు!

Updated on: Oct 01, 2026 | 5:03 PM

దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ ఈ-చలాన్ల వసూళ్లపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. చెల్లించని చలాన్లను విద్యుత్‌ బిల్లులతో అనుసంధానించి వసూలు చేసే అవకాశాన్ని పరిశీలించాలని జస్టిస్‌ జేబీ పర్దీవాలా, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ ధర్మాసనం సూచించింది. వాహన రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌, యాజమాన్య బదిలీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఫిట్‌నెస్‌, పీయూసీ వంటి సేవలను కూడా బకాయిల చెల్లింపుతో అనుసంధానించే అంశం చర్చకు వచ్చింది. సుమారు రూ.45,000 కోట్ల ఈ-చలాన్లు బకాయిగా ఉన్నట్లు కోర్టుకు తెలిపారు.

దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న ట్రాఫిక్ చలాన్ల బకాయిల వసూలుపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన సూచనలు చేసింది. పెండింగ్‌లో ఉన్న చలాన్లను వేగంగా వసూలు చేయడానికి కఠినమైన, వినూత్నమైన కొత్త మార్గాలను అన్వేషించాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇందులో భాగంగా.. బకాయి ఉన్న ట్రాఫిక్ చలాన్ల మొత్తాన్ని నేరుగా వాహనదారుల విద్యుత్ బిల్లులకు జత చేసి వసూలు చేసే అవకాశాన్ని పరిశీలించాలని జస్టిస్ జేబీ పర్దీవాలా సూచించారు. ఒకవేళ ఆ చలాన్ల మొత్తంతో కలిపి ఉన్న విద్యుత్ బిల్లును చెల్లించకపోతే, కరెంట్ సరఫరాను నిలిపివేసే కఠిన విధానాన్ని కూడా ఆలోచించవచ్చని అభిప్రాయపడ్డారు. కరెంట్ బిల్లుల ఆలోచనతో పాటు, చలాన్లు చెల్లిస్తేనే రవాణా శాఖ సేవలు అందేలా అనుసంధానించాలని కోర్టు పేర్కొంది. వాహన రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ, వాహన యాజమాన్య బదిలీ, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, కాలుష్య నియంత్రణ పత్రం జారీ తదితర సేవలన్నింటినీ బకాయిల చెల్లింపుతో ముడిపెట్టాలని సూచించారు. అంతేకాకుండా, పరిమితికి మించి చలాన్లు పెండింగ్‌లో ఉంటే ఆ వాహనాలను ‘బ్లాక్‌లిస్ట్’ చేయడం, అవసరమైతే అధికారుల ద్వారా సీజ్ చేయించడం వంటి చర్యలను కూడా పరిశీలించాలని స్పష్టం చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఇప్పటివరకు మొత్తం సుమారు రూ. 45,000 కోట్ల విలువైన ట్రాఫిక్ చలాన్లు బకాయిగా ఉన్నాయని, అందులో ఇప్పటివరకు రూ. 25,000 కోట్లు మాత్రమే వసూలయ్యాయని కోర్టుకు నివేదిక అందింది. ఈ భారీ బకాయిలను రాబట్టడానికే సుప్రీంకోర్టు ఈ తీవ్రమైన ప్రతిపాదనలను ముందుకు తీసుకొచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెరగనున్న ఏసీ, టీవీ, ఫ్రిజ్‌ల ధరలు

Loading...
Unable to load recommendations.
Follow Us