బ్యాంక్ ఖాతా లేకపోయినా మనీ పంపుకోవచ్చు.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే

Updated on: Nov 16, 2026 | 6:55 PM

బ్యాంకు ఖాతా లేని వారు కూడా బ్యాంకు శాఖకు వెళ్లి NEFT ద్వారా రూ.50,000 వరకు ఇతరుల ఖాతాలకు నగదు పంపవచ్చని RBI కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. నగదు రూపంలో అందించే బదిలీలకు ఒక్కో లావాదేవీకి రూ.10,000, నెలకు రూ.25,000 పరిమితి విధించింది. ధృవీకరించిన మొబైల్ నంబర్, గుర్తింపు పత్రం, అదనపు భద్రతా ప్రమాణీకరణ తప్పనిసరి చేసింది.

దేశీయ నగదు బదిలీ నిబంధనలను మరింత సరళతరం చేస్తూనే, భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. బ్యాంకింగ్ సేవలు అందరికీ సులభంగా చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ నూతన ఆదేశాలను వెలువరించింది. దీని ప్రకారం.. బ్యాంకు ఖాతా లేని సామాన్య పౌరులు సైతం నేరుగా ఏదైనా బ్యాంకు శాఖకు వెళ్లి, NEFT సదుపాయం ద్వారా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాకు రూ. 50,000 వరకు నగదును బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే, బ్యాంకు ఖాతా లేని వ్యక్తులకు నిధులు పంపే ‘నగదు చెల్లింపు’ సేవలకు కూడా ఆర్బీఐ స్పష్టమైన పరిమితులు విధించింది. ఖాతాదారులు తమ ఖాతాల నుంచి నగదు లేని వ్యక్తులకు డబ్బు పంపవచ్చు. ఈ నిధులను స్వీకర్తలు సమీపంలోని ఏటీఎంల ద్వారా గానీ, బ్యాంకులు నియమించిన బిజినెస్ కరస్పాండెంట్లు లేదా అధీకృత కేంద్రాల ద్వారా నగదు రూపంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం కింద ప్రతి లావాదేవీకి గరిష్ట పరిమితిని రూ. 10,000గా, ఒక లబ్ధిదారుడు నెలవారీగా పొందే మొత్తం పరిమితిని రూ. 25,000గా నిర్ధారించారు. ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ కఠినమైన కేవైసీ నిబంధనలను తప్పనిసరి చేసింది. నగదు పంపేవారు తమ ధృవీకరించిన మొబైల్ నంబరుతో పాటు, సెల్ఫ్-అటెస్టేషన్ చేసిన అధికారిక గుర్తింపు పత్రాన్ని సమర్పించాలి. లావాదేవీల భద్రత కోసం అదనపు ప్రమాణీకరణ అంశం అమలును కూడా ఖరారు చేశారు. అనుమానాస్పద లావాదేవీలను పర్యవేక్షించేందుకు ‘వెలాసిటీ చెక్స్’ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, నగదు జమ అయిన వెంటనే వినియోగదారులకు తక్షణ హెచ్చరిక సందేశాలు పంపాలని బ్యాంకింగ్ సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాలు కంటే మంచి కాల్షియం, ప్రొటీన్‌ అందించే ఆహారాలు ఇవే

చెట్టుపైనుంచి నోట్ల వర్షం.. అసలేం జరిగిందో మీరే చూడండి!

ఏఐతో పెను ప్రమాదం.. గూగుల్, మెటాపై కోర్టులో కేసు

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

Published on: Nov 16, 2026 06:52 PM
Loading...
Unable to load recommendations.
Follow Us