IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే

Updated on: Feb 13, 2026 | 10:45 AM

IRCTC 25 సుదూర రైళ్లలో 'ఈ-ప్యాంట్రీ' సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ప్రయాణికులు ఇప్పుడు తమకు నచ్చిన నాణ్యమైన ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసిన భోజనం ప్రధాన స్టేషన్లలో నేరుగా సీటు వద్దకే డెలివరీ అవుతుంది. నగదు రహిత చెల్లింపులు, మీల్ వెరిఫికేషన్ కోడ్‌తో సురక్షితమైన డెలివరీ సదుపాయం ఉంది. ఇది సుదీర్ఘ రైలు ప్రయాణాలకు ఎంతో సౌకర్యాన్ని అందిస్తుంది.

రైలు ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయోగాత్మకంగా 25 సుదూర ప్రాంత రైళ్లలో ‘ఈ-ప్యాంట్రీ’ సేవలను ప్రారంభించింది. ఈ సదుపాయం ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన భోజనాన్ని ముందస్తుగా బుక్ చేసుకునే వీలుంటుంది. IRCTC పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వికె భట్టి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త వ్యవస్థ ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన రుచులను ప్యాంట్రీ కార్ మెనూకే పరిమితం కాకుండా, విశాలమైన ఆహార ఎంపికల నుండి ఎంచుకోవచ్చు. ఆర్డర్ చేసిన భోజనాన్ని రైలు మార్గమధ్యంలో ఎంపిక చేసిన ప్రధాన స్టేషన్లలో నేరుగా సీటు వద్దకే డెలివరీ చేస్తారు. ఇది సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది. ప్రస్తుతం ఈ-ప్యాంట్రీ సేవలు అందుబాటులోకి వచ్చిన వాటిలో తూర్పు మధ్య రైల్వే పరిధిలోని రైళ్లు ఎక్కువగా ఉన్నాయి. జయనగర్-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్, దానాపూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, బరౌని-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్‌, జయనగర్-ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ వంటి కీలక రైళ్లలో ఈ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు నగదు రహిత లావాదేవీల కోసం ఆన్‌లైన్‌లోనే పేమెంట్ చేయవచ్చు. ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రయాణికులకు మీల్ వెరిఫికేషన్ కోడ్ ఇస్తారు. ఆహారం అందుకునే సమయంలో ఈ కోడ్ ద్వారా డెలివరీని నిర్ధారించుకోవచ్చు. ఈ విధానానికి వచ్చే స్పందనను బట్టి భవిష్యత్తులో మరిన్ని రైళ్లకు ఈ సేవలను విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం IRCTC అధికారిక వెబ్‌సైట్ www.irctc.co.in ని సందర్శించండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎలుగుబంట్ల బీభత్సం.. వణికిపోతున్న గ్రామ ప్రజలు

OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్‌.. రసవత్తరంగా సాగే కథ

Kona Venkat: కంటెంట్ ఉంటే.. సినిమా హిట్టే..

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్

కేబుల్‌ వైర్లు కాదు.. యమ పాశాలు.. నిర్లక్ష్యంపై ఆగ్రహం