Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం గోల్డ్‌ ధర ఎంతంటే!

Updated on: Sep 10, 2026 | 7:50 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. సెప్టెంబర్‌ 10న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,200 పెరగడంతో ధర రూ.1,55,510కి చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.1,42,550 పలుకుతోంది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉండి కిలో రూ.2,55,000గా కొనసాగుతోంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధరలు ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో స్వల్ప తేడాలు నమోదయ్యాయి.

పశ్చిమాసియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల మధ్య బంగారం ధరలు ఎగసిపడుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనపడటం లేదు. దీంతో పెట్టుబడిదారులు తమ ఆస్తులను కాపాడుకునేందుకు సేఫ్ హెవెన్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలతో డాలర్ కూడా బలహీనపడింది. పెట్టుబడిదారులు డాలర్ వైపు చూడటం మానేస్తున్నారు. దీంతో పసిడి ధరలు నింగిని తాకుతున్నాయి. సెప్టెంబర్‌ 10 గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1200 పెరిగి రూ. 1,55,510 లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1100 పెరిగి, రూ.1,42,550 లు పలుకుతోంది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,55,000 గా కొనసాగుతోంది. సెప్టెంబర్‌ 10, గురువారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు పరిశీలిస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,660 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,700 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,55,510 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,550 పలుకుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,55,510, అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,55 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,510 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,550 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,55,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు.. తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌ చేసుకొని వెళితే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!

దుబాయ్‌లో సింగిల్‌ రూమ్‌ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!

అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!

పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు

హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఇక.. మెట్రో, ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం!

Loading...
Unable to load recommendations.
Follow Us