వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో

Updated on: Feb 14, 2026 | 5:10 PM

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 66 డివిజన్లలో 31 స్థానాలతో మేయర్ పీఠానికి చేరువైన బీజేపీ, బండి సంజయ్ ఎక్స్ అఫిషియో ఓటు, స్వతంత్రుల మద్దతుతో తిరుగులేని శక్తిగా నిలిచింది. వ్యూహం ఫలించి విజయం వరించింది.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయినప్పటికీ, కరీంనగర్‌లో మాత్రం బండి సంజయ్ నాయకత్వంలో కమలం వికసించింది. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి, ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా సత్తా చాటింది. 66 డివిజన్లకు జరిగిన పోరులో బీజేపీ 31 స్థానాలను గెలుచుకుని, మేయర్ పీఠానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 34కు మూడు స్థానాల దూరంలో నిలిచింది. కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 8, స్వతంత్రులు 5 స్థానాలకే పరిమితమయ్యాయి. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోగా, కరీంనగర్ బీజేపీకి, బండి సంజయ్‌కు తిరుగులేని కంచుకోట అని మరోసారి రుజువైంది. బండి సంజయ్ వ్యక్తిగతంగా ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించి ఈ విజయాన్ని సాధించారు.

మరిన్ని వీడియోల కోసం :

రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న క‌వ‌లల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!

బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!

బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!

సొంతకారులో ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్న యువకుడు..అంతలోనే..

హాస్టల్‌లో ఉండటానికి భయపడుతున్న విద్యార్థులు.. ఎందుకంటే?