దృశ్యం సినిమా తరహాలో తండ్రిని చంపేసాడు.. చివరికి

Updated on: Oct 07, 2026 | 10:08 PM

బిహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలో ‘దృశ్యం’ సినిమా స్ఫూర్తితో సొంత తండ్రిని హత్య చేసినట్లు ఓ వ్యక్తిపై ఆరోపణలు వచ్చాయి. పోలీసులకు చిక్కకుండా సూరత్‌లోనే ఉన్నట్లు నమ్మించేందుకు ప్రయత్నించిన నిందితుడు దాదాపు 2,000 కిలోమీటర్లు ప్రయాణించి తండ్రిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే హత్య జరిగిన రాత్రి అతడి ఫోన్‌ పటోరి ప్రాంతంలో ఒక్కసారి ఆన్‌ కావడంతో కీలక ఆధారం లభించింది. అనంతరం సూరత్‌లో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

ప్రముఖ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘దృశ్యం’ చూసి స్ఫూర్తి పొందిన ఓ కొడుకు, పోలీసులకు చిక్కకుండా అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసి సొంత తండ్రినే దారుణంగా హత్య చేశాడు. ఆధారం లేకుండా తప్పించుకోవడానికి దాదాపు 2,000 కిలోమీటర్లు ప్రయాణించినా, అతడు చేసిన ఒకే ఒక్క చిన్న పొరపాటు అతడిని కటకటాల వెనక్కి నెట్టింది. బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సమస్తిపూర్ జిల్లా దర్వా గ్రామానికి చెందిన శివ్ శంకర్ సాహ్ని గుజరాత్‌లోని సూరత్‌లో భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అతడికి తన తండ్రి రఘువీర్ సాహ్ని తో ఆస్తి, భూమి అమ్మకాల విషయాల్లో మనస్పర్థలు ఉన్నాయి. తండ్రి తనను, తన భార్యను వేధిస్తున్నాడని శివ్ శంకర్ భావించాడు. తండ్రి ప్రవర్తనతో విసిగిపోయిన శివ్ శంకర్, ‘దృశ్యం’ సినిమా శైలిలో హత్యకు కుట్ర పన్నాడు. తాను సూరత్‌లోనే ఉన్నట్లు నమ్మించడానికి అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, జులై 26న రైలులో బిహార్ చేరుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా పటోరి స్టేషన్ నుంచి పొలాల గుండా నాలుగు కిలోమీటర్లు నడిచి అర్ధరాత్రి వేళ ఇంటికి వెళ్లాడు. ఆరుబయట నిద్రిస్తున్న తండ్రిపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత వెంటనే అదే మార్గంలో రహస్యంగా సూరత్‌కు తిరుగుపయనమయ్యాడు. తండ్రి చనిపోయినా అంత్యక్రియలకు కూడా రాకపోవడంతో పోలీసులకు శివ్ శంకర్‌పై అనుమానం వచ్చింది. అతడి కాల్ డేటా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. హత్య జరిగిన రాత్రి పటోరి పరిసర ప్రాంతాల్లో అతడి ఫోన్ ఒక్కసారి స్విచ్ ఆన్ అయ్యి, భార్యకు ఒక కాల్ వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆధారంతో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు సూరత్‌లో నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో తన నేరాన్ని శివ్ శంకర్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శివాలయంలో అద్భుత దృశ్యం..శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు

Rakul Preet Singh: మీరు అనుకుంటున్నట్టు నాకు ఎవరూ గిఫ్ట్‌లు.. విల్లాలు ఇవ్వలేదు!

Janhvi Kapoor: ఆ నీచులు చేసింది లైగిక వేధింపులకు తక్కువేం కాదు

Srikanth Odela: సుకుమార్ ఇంటి చుట్టూ మూడేళ్లు పిచ్చోడిలా తిరిగా..

పవన్‌తో సింగీతం ‘జీసెస్’ సినిమా చేద్దామనుకున్నారట.. ఆ సినిమా ఎందుకు ఆగిపోయిదంటే

Loading...
Unable to load recommendations.
Follow Us