యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు!
యాపిల్‌ను నల్ల ఉప్పుతో కలిపి తినడం రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. ఈ కలయిక జీర్ణక్రియను మెరుగుపరచడం, గ్యాస్-ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడం, ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడం వంటి ప్రయోజనాలు అందించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే నల్ల ఉప్పులోనూ సోడియం ఉంటుంది కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు పరిమితంగా తీసుకోవడం మంచిది.
రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌కి దూరంగా ఉండవచ్చు అనే మాట తరచూ వింటూనే ఉంటాం. ఎందుకంటే యాపిల్‌లో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు మనల్ని ఎన్నో రోగాల బారిన పడకుండా కాపాడతాయి. అయితే, చాలామంది యాపిల్‌ను ఉత్తిగానే తింటుంటారు. కానీ..ఆయుర్వేదం, ఆరోగ్య నిపుణుల ప్రకారం.. యాపిల్ ముక్కలపై కొద్దిగా నల్ల ఉప్పు చల్లుకుని తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది కేవలం రుచిని పెంచడానికి మాత్రమే కాదు, శరీరానికి ఒక గొప్ప ఔషధంగా కూడా పనిచేస్తుంది. యాపిల్, నల్ల ఉప్పు కలయిక వల్ల కలిగే 5 ప్రధాన ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.. యాపిల్‌లో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇక నల్ల ఉప్పులో శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఈ రెండింటి కలయిక వల్ల కలిగే శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. యాపిల్‌లో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిపై నల్ల ఉప్పు చల్లి తీసుకోవడం వల్ల పొట్టలోని జీర్ణ రసాలు చురుగ్గా విడుదలవుతాయి. ఇది మనం తిన్న ఆహారం త్వరగా అరగడానికి సహాయపడి, అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు గ్యాస్, పొట్ట ఉబ్బరం, ఎసిడిటీ. నల్ల ఉప్పులో ఉండే సహజ గుణాలు కడుపులోని అదనపు ఆమ్లాలను అదుపు చేస్తాయి. యాపిల్‌తో కలిపి దీనిని తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. యాపిల్, నల్ల ఉప్పు కలయిక శరీరంలోని మెటబాలిజం రేటును పెంచుతుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో తోడ్పడుతుంది. అలాగే, ఈ హెల్తీ స్నాక్ తిన్న తర్వాత కడుపు నిండినట్లు అనిపించి, ఇతర జంక్ ఫుడ్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఈ రెండింటి మిశ్రమం శరీరంలో ఒక సహజ సిద్ధమైన క్లెన్సర్‌లా పనిచేస్తుంది. ఇది రక్తం, కాలేయం లోని హానికరమైన టాక్సిన్లను బయటకు పంపి శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తుంది. దీనివల్ల చర్మం కూడా ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది. సాధారణ ఉప్పుతో పోలిస్తే నల్ల ఉప్పులో సోడియం తక్కువగా ఉండి.. ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. యాపిల్‌లోని విటమిన్లతో ఇవి చేరినప్పుడు శరీరానికి తక్షణ శక్తి లభించి, అలసట తగ్గుతుంది. యంత్రం పూట ఆకలి వేసినప్పుడు చిప్స్, బిస్కెట్లు వంటి అన్‌హెల్తీ స్నాక్స్ తినే బదులు, ఇలా నల్ల ఉప్పు చల్లిన యాపిల్ ముక్కలను తినడం ఎంతో ఉత్తమం. అయితే, అధిక రక్తపోటు సమస్య తీవ్రంగా ఉన్నవారు మాత్రం ఉప్పును పరిమితంగా వాడుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే కానీ.. వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటని అనుసరించే ముందు వైద్యులను సంప్రదించి వారి సలహామేరకు తీసుకోవడం మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
Trisha Krishnan: లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్ అమ్మే పనిలో బిజీగా షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్.. తర్వాత ఏమైందంటే..
Anupama Parameswaran: నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..