44 నుంచి 60 ఏళ్ల వయసులో మీ శరీరంలో జరిగేది ఇదే! అధ్యయనాల్లో కొత్త నిజాలు

Updated on: Jun 20, 2026 | 2:57 PM

వృద్ధాప్యం క్రమంగా కాకుండా కొన్ని వయసుల్లో వేగంగా ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలు వెల్లడించాయి. ముఖ్యంగా 44, 50, 60 ఏళ్ల వయసుల్లో జీవక్రియ, గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, రక్తనాళాల పనితీరులో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. సరైన వ్యాయామం, ఆరోగ్య పరీక్షలు, మంచి నిద్ర, ఒత్తిడి నియంత్రణ ద్వారా ఈ ప్రభావాలను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

వయసు పెరిగే కొద్దీ వృద్ధాప్యం రావడం సహజం. ఇది అన్ని వేళలా ఒకేలా ఉండదని, ఒక్కో వయసులో ఒక్కోలా జీవ సంబంధిత మార్పులు వేగవంతం అవుతాయని తాజా శాస్త్రీయ పరిశోధనలు తేల్చాయి. ముఖ్యంగా 44, 50, 60 ఏళ్ల వయసులో శరీరంలో కీలక మార్పులు వేగంగా చోటుచేసుకుంటాయని స్టాన్‌ఫర్డ్ మెడిసిన్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మార్పులు.. జీవక్రియ, గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతాయని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. స్టాన్‌ఫర్డ్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో, 25 నుంచి 75 ఏళ్ల వయసు వారిలో దాదాపు 1,35,000 అణువులు, సూక్ష్మజీవులను విశ్లేషించారు. 40 ఏళ్ల మధ్యలో, 60 ఏళ్ల సమీపంలో శరీరంలో రెండు ప్రధాన మార్పుల దశలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సమయంలో జీవక్రియ, కొలెస్ట్రాల్, మూత్రపిండాలు, రోగనిరోధక వ్యవస్థ పనితీరులో మార్పులు గమనించారు. మరోవైపు, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జరిపిన పరిశోధనలో 50 ఏళ్ల వయసును ఒక కీలక మలుపుగా గుర్తించారు. ఈ వయసు తర్వాత అనేక అవయవాలు, ముఖ్యంగా రక్తనాళాల పనితీరు వేగంగా క్షీణించడం మొదలవుతుందని వెల్లడైంది. అధ్యయనాల ప్రకారం.. శరీరంలో మార్పులు క్రమంగా కాకుండా, కొన్నిసార్లు నాటకీయంగా ఉంటాయని వివరించారు. 40 ఏళ్లలో బరువు పెరగడం, వ్యాయామం తర్వాత కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం వంటివి ఈ మార్పుల వల్లే జరుగుతాయని నిపుణులు అంటున్నారు. ఈ పరిశోధనల ప్రకారం, వ్యాధులు వస్తాయని భయపడాల్సిన అవసరం లేదని, అయితే నడివయసు నుంచే సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. కండరాలను కాపాడుకోవడానికి వ్యాయామం, క్రమం తప్పకుండా రక్తపోటు, కొలెస్ట్రాల్, షుగర్ స్థాయిలను పర్యవేక్షించుకోవడం, తగినంత నిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవడం, మద్యపానాన్ని పరిమితం చేయడం వంటి చర్యల ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపవచ్చని వారు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాత్రూమ్‌లో వింత శబ్దం.. వెళ్తే దిమ్మతిరిగే సీన్..

గ్యాస్‌ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌! జూన్ 30 లాస్ట్‌ డేట్‌ ఏం చేయాలంటే?

ఇక పై డాక్టర్ చిట్టీ ఉంటేనే దగ్గు మందు! కాఫ్‌ సిరప్ కు బానిసగా యూత్‌.. చిన్నారుల ప్రాణం తీసే సిరప్!

సహారాలోనూ తప్పని ఆన్‌లైన్‌ మీటింగ్‌! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..

ఏంటి ఈ సరికొత్త ఆన్‌లైన్‌ షాపింగ్‌ విధానం?

Follow Us