శ్రీవారి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం విడుదల.. ఆస్తులను వినియోగంలోకి తెచ్చేందుకు పాలకమండలి ప్రణాళికలు..!

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే శ్రీవారి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది.

శ్రీవారి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం విడుదల..  ఆస్తులను వినియోగంలోకి తెచ్చేందుకు పాలకమండలి ప్రణాళికలు..!
Follow us

|

Updated on: Nov 28, 2020 | 5:37 PM

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే శ్రీవారి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా టీటీడీకి 1,128 ఆస్తులు ఉన్నట్లు టీటీడీ పాలక మండలి పేర్కొంది.దేశవ్యాప్తంగా శ్రీవారికి భక్తులు సమర్పించిన ఆస్తులు 8088.89 ఎకరాల స్థలాలు టీటీడీకి ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆస్తులను ఏ విధంగా వినియోగంలోకి తేవాలన్న అంశంపై కమిటీ. త్వరలో ఈహెచ్‌ఎస్‌ స్కీంను అమలు చేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

మొత్తం ఆస్తుల్లో ప్రస్తుతం 2085.41 ఎకరాల వ్యవసాయ ఆస్తులు కాగా, 6003.48 ఎకరాల వ్యవసాయేతర ఆస్తులు ఉన్నట్లు టీటీడీ పేర్కొంది. 1974 నుండి 2014 వరకు 335.23 ఎకరాల భూములను అమ్మకాలు జరపినట్లు వెల్లడించింది. కాగా, ఆ ఆస్తుల విక్రయం ద్వారా టీటీడీకి రూ.6.13 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు వివరించింది టీటీడీ. ప్రస్తుతం శ్రీవారికి దేశవ్యాప్తంగా 7753.66 ఎకరాలు ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో 1792.39 ఎకరాల వ్యవసాయ భూమి, 5961.27 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉన్నట్లు తెలిపింది. ఇక, శ్రీవారి ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచిన టీటీడీ