Viral Video: అక్కో.! నీ గుండె గట్టిదే.. పామును కుర్‌కురే తిన్నట్టు.. కరకరా నమిలి తినేసింది

మనందరికీ పాములంటే భయం. పాము దగ్గరకు వస్తే చాలు.. మైలు దూరం పారిపోతాం. అయితే కొన్ని చోట్ల ఈ పాములను.. ఎంచక్కా ఏదొక పన్నీర్ ముక్కలా కరకర నమిలి తినేస్తుంటారు. ఇక ఇలాంటి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఆ కోవలోనే ఓ వీడియో..

Viral Video: అక్కో.! నీ గుండె గట్టిదే.. పామును కుర్‌కురే తిన్నట్టు.. కరకరా నమిలి తినేసింది
Viral
Follow us

|

Updated on: Jun 17, 2024 | 11:39 AM

మనందరికీ పాములంటే భయం. పాము దగ్గరకు వస్తే చాలు.. మైలు దూరం పారిపోతాం. అయితే కొన్ని చోట్ల ఈ పాములను.. ఎంచక్కా ఏదొక పన్నీర్ ముక్కలా కరకర నమిలి తినేస్తుంటారు. ఇక ఇలాంటి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఆ కోవలోనే ఓ వీడియో ఇటీవల ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఒక యువతి ప్లేట్ నిండా పాములను పచ్చిగా తింటోంది. మీరూ ఆ వీడియో చూస్తే షాక్ కావడం ఖాయం.

అవునండీ.! మేము చెబుతున్నది నిజమే.. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో మీకు కనిపించేది దక్షిణ కొరియాకు చెందిన ఓ యువతి. కూరగాయలతో పాటు పాములను కూడా పచ్చిగా తింటున్న దృశ్యం మీరు చూడవచ్చు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘asmrmukbangworld’ అనే పేజీ షేర్ చేసింది. ఆమె పామును పచ్చిగా కరకర నమిలి తింటుండటం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఈ వీడియోకు ఇప్పటికే మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. లైకులతో హోరెత్తిస్తున్నారు. కాగా, దీనిపై నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపించారు. ‘మనం భారతదేశంలో పుట్టడం మంచిదైందని’ ఒకరు కామెంట్ పెట్టగా.. ‘చైనీస్ ప్రజలు దీన్ని చూసి సంతోషపడి ఉంటారని’ ఇంకొకరు.. ‘వారి చేసే ఇలాంటి కొత్త డైట్‌లతో ప్రపంచానికి కొత్త వైరస్‌లు వస్తున్నాయి’ అని కామెంట్ పెట్టారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..