అరుదైన పునుగు పిల్లి.. దీని తైలంతోనే తిరుమల వెంకన్నకు అంతటి తేజస్సు.. ఎలానో తెల్సా

TV9 Telugu

27 May 2024

పునుగు పిల్లి చాలా అరుదైన జంతువని, అంతరించిపోతున్న జీవ జాతుల్లో ఒకటని అటవీశాఖ గుర్తించింది.  విశిష్టమైన ఈ పునుగు పిల్లులు శేషాచల అడవుల్లో మాత్రమే ఉన్నాయి. 

ఇటీవల ఏపీలో అదే పనిగా కనిపించడం మంచి పరిణామమే. వేల ఏళ్ల క్రితం సాలిగ్రామ విగ్రహంగా కొలువైన తిరుపతి వేంకటేశ్వర స్వామి వారు.. ఇప్పటికీ అంతటి దివ్య తేజస్సుతో ప్రకాశించడానికి కారణం పునుగుపిల్లి తైలమే. 

పునుగు పిల్లి శరీరం.. గంధపు చెక్కకు రాజుకోవడం వల్ల పునుగు తైలం వస్తుంది.  ఈ పునుగు పిల్లి ప్రతి 10 రోజులకు ఒకసారి శరీర గ్రంథుల ద్వారా చెమటను విసర్జిస్తుందట. అందుకే ఈ పునుగుపిల్లి శరీరం నుంచి తైలం తీయడానికి ఇనుప జల్లెడలో ఉంచి.. చందనపు కర్రను నిలబెడతారు.

ఈ పిల్లి శరీరంపై చెమట కొద్దిగా అట్టలా ఏర్పడుతుంది. పునుగు తన శరీరాన్ని ఇనుప జల్లెడలో నిలబెట్టిన చందనపు కర్రకు రుద్దుతుంది. అలా కర్రకు శరీరంపై చెమట ద్వారా వచ్చినదంతా బంకలా మారుతుంది. అలా తైలాన్ని తీసి స్వామివారి సేవకు ఉపయోగిస్తుంటారు.

ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత.. తల నుంచి పాదాల దాకా పునుగుపిల్లి తైలం పులుముతారు. అనాదిగా కొనసాగుతోందీ ఆచారం.

పునుగు పిల్లి తైలం వల్ల స్వామి వారి విగ్రహానికి పగుళ్లు రాకపోవడమే కాదు, ప్రకాశమూ తగ్గకుండా ఉంటోందని పండితులు చెబుతున్నారు.