పురుషుల షర్టులకు కుడివైపు, మహిళల షర్టులకు ఎడమవైపున బటన్లు ఎందుకు ఉంటాయో తెలుసా?

మహిళలు, పురుషులు వేసుకునే షర్టులు చూడటానికి ఒకేలా ఉన్నప్పటికీ, వాటి బటన్లు అమర్చే వైపులో స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. పురుషుల షర్టులకు బటన్లు కుడి వైపున ఉంటే, మహిళల షర్టులకు ఎడమ వైపున ఉంటాయి. దీని వెనుక శతాబ్దాల నాటి చరిత్ర, ఆచరణాత్మక కారణాలు ఉన్నాయి. ఈ సంప్రదాయమే ఇప్పటికీ ఫ్యాషన్ రంగంలో కొనసాగుతోంది. పురుషుల షర్టులకు కుడివైపు, మహిళల షర్టులకు ఎడమవైపున బటన్లు ఎందుకు ఉంటాయో తెలుసా? ఆసక్తికర చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పురుషుల షర్టులకు కుడివైపు, మహిళల షర్టులకు ఎడమవైపున బటన్లు ఎందుకు ఉంటాయో తెలుసా?
Shirt Button History
Image Credit source: tv9 telugu

Updated on: Sep 07, 2026 | 5:02 PM

ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ ప్రపంచంలో అనేక మార్పులు వచ్చాయి. పురుషులు, మహిళలు ధరించే దుస్తులలో షర్టులు, జీన్స్ వంటివి ఒకే తరహా డిజైన్లలో లభిస్తున్నాయి. అయితే మీరు ఎప్పుడైనా గమనిస్తే.. అబ్బాయిల షర్టులకు, అమ్మాయిల షర్టులకు మధ్య ఒక ప్రధానమైన వ్యత్యాసం కనిపిస్తుంది. అదే షర్టు బటన్లు, అదేనండీ గుండీల అమరిక. అబ్బాయిల చొక్కాలకు బటన్లు కుడి వైపున ఉంటే, అమ్మాయిల చొక్కాలకు ఎడమ వైపున ఉంటాయి. రెండూ ఒకే రకమైన దుస్తులైనప్పటికీ ఈ తేడా ఎందుకు ఉందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరం.

చారిత్రక కారణాలు, పరిచారికల సంస్కృతి:

దీనికి ప్రధాన కారణం 13వ శతాబ్దపు రాజుల కాలం నాటి చరిత్రతో ముడిపడి ఉంది. ఆ కాలంలో షర్టులు ధరించడం అనేది కేవలం ధనిక, రాచరిక కుటుంబాలకు చెందిన మహిళలకే సాధ్యమయ్యేది. వారికి దుస్తులు తొడిగించడానికి ప్రత్యేకంగా పరిచారికలు ఉండేవారు. ఎదురుగా నిలబడి దుస్తుల బటన్లు వేసేటప్పుడు, కుడిచేతి వాటం ఉన్న దాసీలకు మహిళల షర్టు బటన్లు ఎడమ వైపున ఉంటే వేయడం చాలా సులభంగా ఉండేది. అందుకే మహిళల దుస్తులకు ఎడమ వైపున బటన్లు కుట్టడం ప్రారంభించారు.

పురుషుల యుద్ధ వ్యూహాలు, స్వయంగా బటన్లు పెట్టుకోవడం:

పురుషులు తమ బట్టలను తమంతట తామే వేసుకునేవారు. ఎక్కువమంది కుడిచేతి వాటం కలిగి ఉండటం వల్ల, తమ షర్టు బటన్లను కుడి వైపున ఉంచితే సులభంగా పెట్టుకోగలిగేవారు. అంతేకాకుండా, ఆ కాలంలో పురుషులు యుద్ధాలలో పాల్గొనేటప్పుడు కత్తి లేదా ఆయుధాలను ఎడమ వైపున ఉంచుకునేవారు. కుడి చేతితో ఆయుధాన్ని వేగంగా తీసే క్రమంలో షర్టు బటన్లు అడ్డుపడకుండా ఉండేందుకు కూడా బటన్లను కుడి వైపున అమర్చడం ఆనవాయితీగా మారింది.

ఇవి కూడా చదవండి

పిల్లలకు పాలిచ్చే సౌకర్యం:

ఫ్యాషన్ డిజైనర్లు, చరిత్రకారుల ప్రకారం మరొక ఆచరణాత్మక కారణం కూడా ఉంది. సాధారణంగా మహిళలు తమ చిన్నపిల్లలను ఎడమ చేతితో పట్టుకుని పాలు ఇస్తుంటారు. అటువంటప్పుడు కుడి చేయి ఖాళీగా ఉంటుంది. కాబట్టి, ఎడమ వైపు ఉన్న బటన్లను సులభంగా తెరవడానికి లేదా మూయడానికి వీలుగా ఈ డిజైన్ సహాయపడుతుంది.

శతాబ్దాల క్రితం సాంఘిక హోదా, యుద్ధ అవసరాలు, సౌకర్యం కోసం ప్రారంభమైన ఈ చిన్న డిజైన్ వ్యత్యాసం, నేటి ఆధునిక ఫ్యాషన్ యుగంలో కూడా ఒక సాంప్రదాయక నియమంగా కొనసాగుతుండటం విశేషం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us