Viral Video: చెప్పుతో మొసలికి చుక్కలు చూపించిన యువతి.. దెబ్బకు పరార్..

|

Nov 15, 2021 | 1:43 PM

సోషల్‌ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని పాత వీడియోలు కూడా అప్పుడప్పుడు ట్రెండ్ అవుతుంటాయి.

Viral Video: చెప్పుతో మొసలికి చుక్కలు చూపించిన యువతి.. దెబ్బకు పరార్..
Woman Scares Off Crocodile
Follow us on

సోషల్‌ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని పాత వీడియోలు కూడా అప్పుడప్పుడు ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా మొసలికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ సర్కులేట్ అవుతోంది.  @RexChapman అనే ట్విట్టర్‌ ఖాతా నుంచి పాత వీడియోను నవంబర్ 11న మళ్లీ పోస్ట్ చెయ్యడంతో… సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చాలా క్రేజీగా ఉంది. ఎవరైన తమను వేధించినా.. తిక్క వేషాలు వేసినా.. మహిళలు వెంటనే చెప్పుతో అవతలి వ్యక్తి బుద్ది చెబుతారు. అమ్మవారి కాళిగా మారినప్పుడు త్రిశూలం పట్టినట్లు.. ఆడవాళ్లకు కోపం వస్తే వెంటనే చెప్పు తీస్తారు. తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో ఓ యువతి చెప్పుతో మొసలిని భయపెట్టింది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆ మహిళ ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ముందుగా వీడియోపై ఓ లుక్కేయండి.

ఈ వీడియోలో ఓ యువతి నది ఒడ్డున సేదతీరుతుంది. ఆమెతో పాటూ ఆమె పెట్ డాగ్ కూడా అక్కడే తచ్చాడుతుంది. అంతలో ఓ మొసలి… ఆ యువతి వైపు ఫాస్ట్‌గా దూసుకువచ్చింది. మొసలి రాకను గమినించిన  ఆ యువతి వెంటనే చెప్పు తీసి.. దాన్ని బెదిరించింది. తన చెప్పుతో శబ్ధం చేయడంతో.. అదిరిపోయిన మొసలి వెనక్కి వెళ్లిపోయింది.  ఆమె డేర్‌నెస్‌కు అందరూ ఫిదా అవుతన్నారు.  లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. తమదైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Andhra Pradesh: రాములోరి కంట నీరు.. ముప్పు తప్పదంటున్న భక్తులు

Dangerous Tree: ఆ చెట్టు కిందకు వెళ్తే చనిపోతారు.. అత్యంత ప్రమాదకర వృక్షం..