Video:సముద్రంలో ఇసుక తుఫాన్‌ ఇలా ఉంటుందా..? వీడియో చూస్తే ఓళ్లు జలదరించాల్సిందే!

|

Mar 20, 2025 | 5:01 PM

ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తుందో.. దాని విధ్వంసం కూడా అంత కన్నా భయంకరంగా ఉంటుంది. ప్రకృతి ఉగ్రరూపం దాల్చినపుడు తల వంచడం తప్ప ఎంత పెద్ద తోపులైనా, ఎంతటి టెక్నాలజీ అయినా ఏమీ చేయలేదని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపితమైంది. ప్రశాంతంగా ఉండే మహా సముద్రాలు ఎప్పుడు ఎలాంటి ఉగ్రరూపం ప్రదర్శిస్తాయో ఊహించడం కష్టమే. అలాంటి వీడియోనే ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లంతా ఆశ్చర్యపోతూ రకరకాలుగా తమ

Video:సముద్రంలో ఇసుక తుఫాన్‌ ఇలా ఉంటుందా..? వీడియో చూస్తే ఓళ్లు జలదరించాల్సిందే!
Sand Storm
Follow us on

ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తుందో.. దాని విధ్వంసం కూడా అంత కన్నా భయంకరంగా ఉంటుంది. ప్రకృతి ఉగ్రరూపం దాల్చినపుడు తల వంచడం తప్ప ఎంత పెద్ద తోపులైనా, ఎంతటి టెక్నాలజీ అయినా ఏమీ చేయలేదని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపితమైంది. ప్రశాంతంగా ఉండే మహా సముద్రాలు ఎప్పుడు ఎలాంటి ఉగ్రరూపం ప్రదర్శిస్తాయో ఊహించడం కష్టమే. అలాంటి వీడియోనే ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లంతా ఆశ్చర్యపోతూ రకరకాలుగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు.

వైరల్‌ అవుతున్న వీడియోలో సముద్రం మీద ఓ అద్భుత దృశ్యం కనిపించింది. ఆ వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే. హాలీవుడ్ సినిమాలో గ్రాఫిక్స్ సీన్‌లా ఆ దృశ్యం కనబడుతోంది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఒక షిప్‌ సముద్రంపై వెళుతూ ఉంటుంది. ఆ సమయంలో దాని ముందుగా ఓ పెద్ద ఇసుక మేఘం ముసురుకుంటూ వచ్చింది. కొద్ది సేపటికి ఆ ఓడను ఆ ఇసుక మేఘం పూర్తిగా కమ్మేసింది. ఇటువంటి ఇసుక తుఫానులను హబూబ్ అని పిలుస్తారట.

ఇసుక తుఫాన్లు పొడిగా ఉండే తీరప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి. బలమైన గాలుల కారణంగా ఏర్పడతాయి. వేడి గాలి అధిక వేగంతో వీచినపుడు, దానితో పాటు తీరంలోని ఇసుక కూడా పైకి లేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి దృశ్యాలు ఎడారి ప్రాంతాలలో కనిపిస్తాయి. అలాంటిది సముద్ర తీరంలో కనిపించడం నెట్టింట ఆసక్తికర చర్చగా మారింది.

ఇసుక తుఫానులు సముద్రాన్ని చేరుకున్నప్పుడు, మరింత ప్రమాదకరంగా మారతాయి. ఇసుక తుఫానుల కారణంగా షిప్‌లు డ్యామేజ్ అవుతుంటాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. సముద్రంపైన ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని కొంతమంది నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తే.. ఇది ఇంగ్లీష్‌ సినిమాలోని హారర్ సీన్‌లా ఉందని మరికొంత మంది పోస్టులు పెడుతున్నారు.

 

 

వీడియో చూడండి: