Viral Video: గాల్లో ఎగిరిన కారు.. వైరల్ అయిన వీడియో..

|

Nov 23, 2021 | 11:08 AM

అమెరికాలోని ఇండియానా పోలీసులు ఇటీవల ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‎గా మారింది. ఆ వీడియోలో ఒక కారు రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా రావటంతో ప్రమాదం జరిగింది....

Viral Video: గాల్లో ఎగిరిన కారు.. వైరల్ అయిన వీడియో..
Accident
Follow us on

అమెరికాలోని ఇండియానా పోలీసులు ఇటీవల ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‎గా మారింది. ఆ వీడియోలో ఒక కారు రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా రావటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన అమెరికాలోని ఇండియానాలో అక్టోబర్ 17, 2021న జరిగింది. ఈ వీడియోను యూట్యూబ్ ఛానెల్ వైరల్ హాగ్ షేర్ చేసింది. వేగంగా వెళ్తున్న కారు మరొక వాహనాన్ని ఢీకొట్టి గాలిలోకి ఎగరడం వీడియోలో చూడవచ్చు.

వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తి, అతని భార్య “డ్యాష్‌క్యామ్ ఉన్న వాహనంలో ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఇప్పటివరకు ఈ వీడియో యూట్యూబ్‌లో 13,000కు పైగా వ్యూస్‌ను వచ్చాయి. దీనిపై చాలా మంది కామెంట్స్ చేశారు. వెంట్రుక వాసిలో పాదచారి బయటపడ్డాడని కామెంట్ చేశారు. కారు నెమ్మదిగా నడిపితే ప్రమాదం జరిగేది కాదన్నారు.

Read Also.. Wedding Viral Video: వెడ్డింగ్‌ పార్టీలో షాకింగ్‌ సంఘటన తలలు పట్టుకున్న అతిధులు నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..