Viral Video: ఆర్టీసీ బస్సులో అపర కాళీగా మారిన మహిళ.. దెబ్బకు దెయ్యం వదలించింది..!

|

Dec 19, 2024 | 7:20 PM

పూణెలో గురువారం నాడు బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ తనను అనుచితంగా తాకాడని ఆరోపిస్తూ ఓ వ్యక్తిని చెంపదెబ్బలు కొట్టింది. వైరల్ వీడియోలో, యువకుడి కాలర్‌ పట్టుకుని దాదాపు 25 సార్లు చెంపలు వాయించేసింది. అనంతరం నేరుగా పోలీసు స్టేషన్‌కు లాక్కెళ్లి, పోలీసులకు అప్పగించింది.

Viral Video: ఆర్టీసీ బస్సులో అపర కాళీగా మారిన మహిళ.. దెబ్బకు దెయ్యం వదలించింది..!
Woman Beat Drunkard
Follow us on

మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని ఓ మహిళ తీవ్రంగా కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సు దిగుతుండగా సదరు వ్యక్తి మహిళను అనుచితంగా తాకేందుకు ప్రయత్నించాడు. దీంతో రెచ్చిపోయిన ఆ మహిళ, అతడి కాలర్ పట్టుకుని 25 సార్లు చెంపదెబ్బలు కొట్టింది. మహారాష్ట్రలోని పూణెలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వైరల్ అవుతున్న వీడియోలో, మహిళ అతని కాలర్ పట్టుకుని గట్టిగా కొట్టడం, అతను చేసిన పనికి క్షమాపణలు చెప్పాలని కోరింది. ఈ హఠాత్తు పరిణామంతో బస్సులో ఉన్న ఇతర ప్రయాణీకులెవరూ జోక్యం చేసుకోలేదు. మరింత రెచ్చిపోయిన ఆ మహిళ సదరు వ్యక్తిని చెంపదెబ్బలు వాయించేసింది. ఆ మహిళ ఒకటి రెండు సార్లు కాదు 25 సార్లు చెంపదెబ్బ కొట్టినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది.

వీడియో చూడండి.. 

 

స్థానిక మీడియా కథనాల ప్రకారం, కండక్టర్ వచ్చి జోక్యం చేసుకునే వరకు మహిళ ఆగలేదు. దీని తర్వాత, ఆమె సమీపంలోని పోలీసు స్టేషన్‌కు ఆ వ్యక్తిని లాక్కెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో, ఆ మహిళ ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో @gharkekaleshX హ్యాండిల్‌లో షేర్ చేయడంతో ఈ క్లిప్‌ను ఇప్పటివరకు 1.25 లక్షల సార్లు వీక్షించారు. కామెంట్ బాక్స్‌లో స్పందనలు వెల్లువెత్తాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..