Viral Video: లిఫ్ట్‌ దగ్గర వేచి ఉన్న మహిళపై కుక్క ఎలా దాడి చేసిందో చూడండి.. వీడియో వైరల్‌!

Viral Video: ఆ ఫుటేజ్‌లో లాబీలో లిఫ్ట్ కోసం వేచి ఉన్న మహిళపై కుక్క అకస్మాత్తుగా దాడి చేసినట్లు కనిపిస్తోంది. ఈ కుక్క సమీపంలోని మరో లిఫ్ట్ నుండి బయటకు వచ్చి ఆ మహిళపైకి దూసుకుపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో..

Viral Video: లిఫ్ట్‌ దగ్గర వేచి ఉన్న మహిళపై కుక్క ఎలా దాడి చేసిందో చూడండి.. వీడియో వైరల్‌!

Updated on: Aug 22, 2025 | 12:10 PM

Viral Video: కుక్కల బీభత్సం రోజురోజుకు పెరిగిపోతోంది. ఒక వైపు కుక్కల దాడులతో ఎంతో మంది బలయవుతున్నారని, వాటిని అరికట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. మరో వైపు సుప్రీం కోర్టు కుక్కలపై కీలక తీర్పును వెలవరించింది. కుక్కల కోసం ప్రత్యేక సెల్టర్‌ ఏర్పాటు చేసి వాటికి ఆహారం అందించాలని తీర్పునిచ్చింది.

ఇది కూడా చదవండి: Traffic Challan: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్ మొత్తంలో 75 శాతం మాఫీ

వీధికుక్కల గొడవ కొనసాగుతున్న ఈ సమయంలో మరొక కుక్క కరిచిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలు రోజురోజుకు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో ఒక పెంపుడు కుక్క ఒక సొసైటీ లోపల ఒక మహిళపై దాడి చేసి కాలుపై కాటేసింది. ఈ సంఘటన యజమాని ముందే జరిగిందని CCTV ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. కుక్క అకస్మాత్తుగా లిఫ్ట్ నుండి బయటకు వచ్చి మహిళను కరిచింది.

ఇది కూడా చదవండి: TGSRTC కార్గో నుంచి తీసుకెళ్లని వస్తువుల వేలం.. 90 శాతం డిస్కౌంట్

 


ఆ ఫుటేజ్‌లో లాబీలో లిఫ్ట్ కోసం వేచి ఉన్న మహిళపై కుక్క అకస్మాత్తుగా దాడి చేసినట్లు కనిపిస్తోంది. ఈ కుక్క సమీపంలోని మరో లిఫ్ట్ నుండి బయటకు వచ్చి ఆ మహిళపైకి దూసుకుపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒక్కసారిగా ఆ మహిళపై కుక్క దాడి చేసి కరవడంతో ఆ మహిళ విలవిలలాడిపోయింది.

ఇది కూడా చదవండి: Gold Price Today: తగ్గినట్లే తగ్గి మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..