Viral Video: రీల్స్‌ పిచ్చి ముదిరితే.. ఇట్లనే ప్రాణాలు పోతాయ్…! మణికర్ణిక ఘాట్ లో షాకింగ్‌ ఘటన

రీల్స్‌ పిచ్చితో ప్రాణాలు పోతున్నా కూడా యువతకు బుద్ది రావడం లేదు. తాజగా అలాంటి ఘటనే ఉత్తరకాశీలోని మణికర్ణిక ఘాట్‌లో జరిగింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను ప్రకారం ఓ యువతి రీల్స్ కోసం గంగానది నీళ్లలోకి...

Viral Video: రీల్స్‌ పిచ్చి ముదిరితే.. ఇట్లనే ప్రాణాలు పోతాయ్...! మణికర్ణిక ఘాట్ లో షాకింగ్‌ ఘటన
Woman Dwowns In Ganga

Edited By:

Updated on: Apr 17, 2025 | 3:46 PM

రీల్స్‌ పిచ్చితో ప్రాణాలు పోతున్నా కూడా యువతకు బుద్ది రావడం లేదు. తాజగా అలాంటి ఘటనే ఉత్తరకాశీలోని మణికర్ణిక ఘాట్‌లో జరిగింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను ప్రకారం ఓ యువతి రీల్స్ కోసం గంగానది నీళ్లలోకి దిగింది. డాన్స్ చేయబోయి పట్టు తప్పి నీళ్లలో పడిపోయింది. చూస్తుండగానే వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. అనంతరం పోలీసులు గాలించినా ప్రయోజనం లేకపోయింది.

ఆ యువతి నీటిలోకి జారిపడినప్పుడు “అమ్మా” అని అరవడం వినిపించింది. ఇప్పటివరకు, పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని కూడా వెలికితీయలేకపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా రీల్స్ కోసం ప్రయత్నించి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి వీడియోలను ప్రాణాలకు పణంగా పెట్టి చేయడంపై నెటిజన్స్‌ విమర్శలు గుప్పిస్తున్నారు.

 

వీడియో చూడండి:

 

మణికర్ణిక ఘాట్‌లో కొట్టుకుపోయిన యువతి.. చివరి మాటగా అమ్మా అని అరవడం వీడియోలో ఉంది. ఇది చాలా మంది మనసులను కలచి వేసేలా చేసింది. ఎవరూ ఇలాంటి రిస్కులు కేవలం రీల్స్ కోసం తీసుకోవద్దని నెటిజన్స్‌ సూచిస్తున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో రీల్స్ తీసి.. వ్యూస్ పెంచుకుని ఏదో సాధించాలని యువత అనుకుంటున్నారు. ఇలాంటి వాటిపై పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియా యూజర్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు.