
మైకెల్ జాక్సన్.. ఈ వ్యక్తిని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పాప్ సంగీత ప్రపంచంలో అతడు తిరుగులేని రారాజు. ఇప్పటివరకు అతడిని అనుకరించేవారు చాలామంది వచ్చారు కానీ మరిపించేవారు మాత్రం రాలేదనే చెప్పాలి. మైకెల్ జాక్సన్‌కు మూన్‌వాక్ సిగ్నేచర్ స్టెప్ అన్న విషయం తెలిసిందే. ఇది అంత ఈజీ స్టెప్ కాదు.. బాడీలోని ప్రతి శరీరం భాగాన్ని అదుపులో ఉంచుకుని డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ జనరేషన్లో చాలామంది సాధన చేసి.. ఆ స్టెప్ నేర్చుకుంటున్నారు. అయితే మనుషుల సంగతి పక్కనబెట్టండి. ఓ బాతు మాత్రం మైకెల్ స్టెప్పులను అలవోకగా వేస్తోంది. అద్భుతమైన మూమెంట్స్‌తో ఆకట్టుకుంటుంది. పాప్ స్టార్ మైకెల్ జాక్సన్ మాదిరి మూన్ వాక్ చేస్తోంది. సదరు బాతు అలా డ్యాన్స్ చేస్తుంటే.. మిగిలిన బాతులు నోరెళ్లబెట్టి చూస్తున్నాయి. కల్నల్ DPK పిళ్లే ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. “పునర్జన్మపై నమ్మకం లేని వారి కోసం ఈ వీడియో. ఇదిగో మైఖేల్ జాక్సన్” అని క్యాప్షన్ పెట్టారు.
వీడియో చూడండి
ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు బాతు డ్యాన్సింగ్ స్కిల్ చూసి ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇదేలా సాధ్యం అని మరికొందరు షాక్ అవుతున్నారు. ఫన్నీ కామెంట్లు పెడుతూ వీడియోను తెగ సర్కులేట్ చేస్తున్నారు. వీడియో చూసిన తర్వాత మీ ఫ్యూజులు కూడా ఎగిరిపోయాయి కదా..!
Also Read: పరగడుపున తులసి నీరు తాగితే ఎన్నో ప్రయోజనాలు.. కనీసం మీరు ఊహించలేరు