Viral Video: పిల్లవాడి ప్రాణాలను కాపాడేందుకు కుక్క ఏం చేసిందో చూడండి.. వీడియో చూస్తే వావ్ అంటారు!

Viral Video: సీసీటీవీ ఫుటేజ్‌లో జర్మన్ షెపర్డ్ ఎంట్రీ ఒక యాక్షన్ సినిమా క్లైమాక్స్ లాంటిదని తెలుస్తోంది. కుక్క వెనక్కి తిరిగి చూసే ధైర్యం కూడా చేయలేదు. ఆ పిల్లవాడు తన స్నేహితులతో సురక్షితంగా ఇంటికి పరిగెత్తాడు. పెంపుడు కుక్క కూడా సంతృప్తితో..

Viral Video: పిల్లవాడి ప్రాణాలను కాపాడేందుకు కుక్క ఏం చేసిందో చూడండి.. వీడియో చూస్తే వావ్ అంటారు!

Updated on: Aug 10, 2025 | 4:29 PM

అక్కడంతా వీధిలో పిల్లలు ఆడుకుంటున్నారు. వారికి అకస్మాత్తుగా ప్రమాదం ముంచుకొచ్చింది. ఇది సినిమాలోని దృశ్యంలా అనిపిస్తుంది. ఇక్కడ ఒక జర్మన్ షెపర్డ్ (కుక్క) తన యజమాని ఇంటి గౌరవాన్ని కాపాడటమే కాకుండా వీధిలోని అమాయక పిల్లలను కూడా కాపాడింది. ఆ కుక్క ఒక్కసారిగా సూపర్‌ హీరోగా మారింది. పిల్లలు ఆడుకుంటుండగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సీసీటీవీ ఫుటేజ్‌లో ఆ ప్రాంతంలోని వీధిలో 3-4 మంది పిల్లలు ఆడుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడు అకస్మాత్తుగా ఒక వీధి కుక్క వారిలో చిన్న పిల్లవాడిని చూసి అతని వెంట పడింది. దీంతో ఆ పిల్లవాడు భయంతో వణికిపోయి పరుగెత్తాడు. ఇంటి నుండి బయటకు చూస్తున్న పెంపుడు జర్మన్ షెపర్డ్ (కుక్క) అతన్ని చూసి అప్రమత్తమైంది. క్షణంలో అది గేటు దాటి నేరుగా రోడ్డుపైకి దూకి సమయం వృధా చేయకుండా దాడి చేస్తున్న కుక్క వైపు పరిగెత్తింది.

ఇది కూడా చదవండి: Viral Video: ఇలాంటి వీడియోను మీరెప్పుడైనా చూశారా? ధైర్యం ఉంటేనే చూడండి.. షాకింగ్ వీడియో వైరల్

ఇవి కూడా చదవండి

సీసీటీవీ ఫుటేజ్ వైరల్:

సీసీటీవీ ఫుటేజ్‌లో జర్మన్ షెపర్డ్ ఎంట్రీ ఒక యాక్షన్ సినిమా క్లైమాక్స్ లాంటిదని తెలుస్తోంది. కుక్క వెనక్కి తిరిగి చూసే ధైర్యం కూడా చేయలేదు. ఆ పిల్లవాడు తన స్నేహితులతో సురక్షితంగా ఇంటికి పరిగెత్తాడు. పెంపుడు కుక్క కూడా సంతృప్తితో ఇంటికి తిరిగి వచ్చిందని చెబుతున్నారు. వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియా వినియోగదారులు కూడా కుక్కను ప్రశంసిస్తున్నారు.

 

ఈ వీడియోను @gharkekalesh అనే ఖాతా నుండి షేర్ చేయగా, ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించారు. చాలా మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఎవరికి నచ్చినట్లుగా వారు కామెంట్లు చేస్తున్నారు. కుక్కలు చాలా విశ్వాసపాత్రమైనవి.. సమయం వచ్చినప్పుడు అవి ప్రాణాలను కాపాడతాయి అంటూ కామెంట్లు చేశారు. మరొక నెటిజన్‌ కుక్క ప్రాణాన్ని కాపాడటానికి కాదు, కుక్కను తరిమికొట్టడానికి దూకినట్లు అనిపిస్తుంది అంటూ వ్యాఖ్యానించాడు. మరో వినియోగదారు ఈ కుక్క సూపర్ హీరో పని చేసిందంటూ ప్రశంసించాడు.

ఇది కూడా చదవండి: ఈ కింగ్ కోబ్రాను చూస్తేనే సుస్సు పడేలా ఉంది..ఎలా పట్టేశావ్ అన్న

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి