Viral Video: రద్దీగా ఉన్న రోడ్డు మీద అంబులెన్స్ డ్రైవర్ డ్రైవింగ్ స్కిల్.. నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..

|

Feb 15, 2022 | 4:32 PM

Viral Video: అంబులెన్స్‌లు(Ambulances) ప్రాణాలను కాపాడే రవాణాసాధనాలు.. రద్దీగా ఉండే వీధుల్లో సైతం ఎంతో నైపుణ్యంగా అంబులెన్స్ లను నడుపుతూ.. ప్రాణాలను నిలబెట్టడంతో ఆస్పత్రికి..

Viral Video: రద్దీగా ఉన్న రోడ్డు మీద అంబులెన్స్ డ్రైవర్ డ్రైవింగ్ స్కిల్.. నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..
Extraordinary Driving Skill
Follow us on

Viral Video: అంబులెన్స్‌లు(Ambulances) ప్రాణాలను కాపాడే రవాణాసాధనాలు.. రద్దీగా ఉండే వీధుల్లో సైతం ఎంతో నైపుణ్యంగా అంబులెన్స్ లను నడుపుతూ.. ప్రాణాలను నిలబెట్టడంతో ఆస్పత్రికి చేరుస్తారు. అయితే సైరన్‌లతో కూడిన ఈ ఎమర్జెన్సీ వాహనం వెళ్లేందుకు రోడ్డు మార్గాన్ని క్లియర్ చేస్తారు. అయినప్పటికీ అంబులెన్స్ లను నడిపే వ్యక్తుల డ్రైవింగ్ నైపుణ్యం ఇతర వాహనాలు నడిపే వారికంటే మరింత అధికంగా ఉండాలి. ఎందుకంటే ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తుల జీవితాలను రక్షించే బాధ్యత ఈ అంబులెన్స్ డ్రైవర్లపైనే ఉంటుంది.

ఇప్పుడు, ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చేసే పనిలో ఉన్న పారామెడికల్ స్టాప్ డ్రైవర్ అసాధారణ డ్రైవింగ్ నైపుణ్యాలను చూపించే ఒక వీడియో వైరల్ అవుతుంది. నిజానికి అంబులెన్స్ సైరన్ వింటే రోడ్డు మీద వాహన యజమానులు డ్రైవర్లు అంబులెన్స్ కు దారి ఇస్తారు. రోడ్డుమీద వెళ్ళడానికి మార్గాన్ని క్లియర్ చేస్తారు. అయితే అన్ని రోడ్లు అంబులెన్స్ డ్రైవర్లకు ఈజీగా డ్రైవ్ చేయడానికి వీలు కలిగి ఉండవు. అయితే అంబులెన్స్ డ్రైవ్ చేసే డ్రైవర్ నైపుణ్యం, ఖచ్చితత్వం ప్రాణం నిలబెడుతుంది. దీంతో అంబులెన్స్ డ్రైవర్లు అత్యవసర పరిస్థితులతో ఎలా వ్యవహరిస్తారో @paramedicoffciall ఛానెల్ సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రదర్శిస్తుంది.

టిక్‌టాక్‌లో షేర్ చేయబడిన క్లిప్‌లలో కార్లతో నిండిన వీధిలో ఒక అంబునెల్స్ లో డ్రైవర్ వేగంగా వెళుతున్నట్లు కనిపిస్తుంది. అతను కార్ల మధ్య అంబులెన్స్ ను ఎంతో చాకచక్యంగా డ్రైవ్ చేస్తూ.. క్షణం కూడా ఆగకుండా డ్రైవ్ చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించబడిందో స్పష్టంగా తెలియలేదు. అయితే డ్రైవర్ టర్కీ వీధుల్లో వెళ్తున్నాడని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. @paramedicofficiall వీడియోలు చాలా మంది వీక్షకులను విస్మయానికి గురిచేస్తూనే ఉన్నాయి.

 

Also Read:

విద్యార్థులతో పాటు తల్లిదండ్రులపై కూడా కేసులు.. ఫేక్‌ సర్టిఫికేట్లపై సీపీ ఆనంద్‌ వార్నింగ్‌..