Viral Video: శునకానందం అంటే ఇదే.. అప్పడం దొంగిలించిన కుక్క ఓ రేంజ్‌లో డ్యాన్స్ చేసింది.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

Viral Video: కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా అమితానందాన్ని కలిగిస్తాయి. దొంగతనం తప్పు అయినా.. చదువుకునే రోజుల్లో స్నేహితుల టిఫిన్ బాక్స్‌లలో మనకు ఇష్టమైన..

Viral Video: శునకానందం అంటే ఇదే.. అప్పడం దొంగిలించిన కుక్క ఓ రేంజ్‌లో డ్యాన్స్ చేసింది.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

Updated on: Jan 07, 2022 | 2:08 PM

Viral Video: కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా అమితానందాన్ని కలిగిస్తాయి. దొంగతనం తప్పు అయినా.. చదువుకునే రోజుల్లో స్నేహితుల టిఫిన్ బాక్స్‌లలో మనకు ఇష్టమైన ఆహారం ఉంటే దానిని దొంగిలించి తింటే కలిగే ఆనందమే వేరు ఉంటుంది. బయటదాకా ఎందుకు.. ఇంట్లో అమ్మ మనకు నచ్చిన వంటకం చేసి అది మనకు అందకుండా పెడితే.. ఎవరూ లేని సమయంలో దాన్ని దొంగచాటుగా తింటే వచ్చే కిక్కే వేరు కదా. అలాంటి పనే ఓ కుక్క కూడా చేసింది. ఇంట్లో ఉన్న తనకు నచ్చిన ఆహారాన్ని దొంగిలించిన కుక్క.. మస్త్ ఖుషీ అయ్యింది. ఆ వస్తువును నోట కరుచుకుని రోడ్డు వెంట గెంతుతూ ఆనందంతో పరుగులు తీసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వివరాల్లోకెళితే.. తలుపు తెరిచి ఉన్న ఓ ఇంట్లోకి కుక్క ఎంటరైంది. వెయింట్ హాల్‌లో టేబుల్‌పై కొన్ని అప్పడాలు పెట్టి ఉన్నాయి. వాటిని చూసి కుక్క.. టక్కున తన నోటికి ఒక అప్పడాన్ని అందుకుంది. ఇంకేముంది.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానిని నోట్లో పెట్టుకుని ఇంటి నుంచి బయటకు వీధి వెంట పరుగులు తీసింది. అయితే అప్పడం దొంగిలించిన ఆనందమో మరేంటో గానీ.. ఆ అప్పడాని నోట్లో పెట్టుకుని చెంగు చెంగున జింక వలె సంతోషంతో గెంతుతూ పరుగులు తీసింది. కుక్క అలా గెంతుతూ పరుగెడుతుంటే దాని ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అయితే, కుక్క ఇంట్లోకి ఎంటరైన సమయంలో ఇంటి యజమాని ఇంట్లోనే ఉన్నారు. కుక్క రాకను గమనించి.. ముందే వీడియో ఆన్ చేశాడు. అలా కుక్క చోరీ అంతా వీడియోలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయ్యింది. 17 సెకన్ల వ్యవధి ఉన్న ఈ వీడియోను ఇప్పటి వరకు 8 వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు. కుక్క ఆనందానికి అవధుల్లేవంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘చురా తినడంలో ఉన్న మజానే వేరు’ అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:


Also read:

Viral Video: ఇదేం వింత.. కప్ప కడుపులో లైట్ వెలుగుతోంది.. షాకింగ్ వీడియో మీకోసం..

ICMR : ఒమిక్రాన్‌తో భయం లేదు.. లక్షణాలు లేకుంటే ఇంట్లోనే చికిత్స.. ఐసీఎంఆర్ నిపుణుల కీలక వ్యాఖ్యలు..

Swimming Without Hands: చేతుల్లేవ్‌.. కాళ్లకు తాడు కట్టుకుని ఈత.. ఇది నిజంగా ‘శివయ్య’ లీలే అనాలేమో..!

Loading...
Unable to load recommendations.
Follow Us