Golgappa: పిల్లలు సర్వ్ చేస్తున్న ఈ పానీపూరీ తింటే మీ జన్మ ధన్యం.. మీరు చిరంజీవులు అంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్

|

Mar 01, 2022 | 9:28 AM

Golgappa: ఉత్తరాది (North India)నుంచి  దక్షిణాది(Sounth India)కి అడుగు పెట్టిన గోల్ గొప్పకు దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. గోల్ గప్ప, పానీపూరి(Pani Puri), పేరు ఏదైనా కావొచ్చు.. కానీ ఈ స్నాక్ ఐటెంను..

Golgappa: పిల్లలు సర్వ్ చేస్తున్న ఈ పానీపూరీ తింటే మీ జన్మ ధన్యం.. మీరు చిరంజీవులు అంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్
Boys Feed Panipuri In Dirty
Follow us on

Golgappa: ఉత్తరాది (North India)నుంచి  దక్షిణాది(Sounth India)కి అడుగు పెట్టిన గోల్ గొప్పకు దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. గోల్ గప్ప, పానీపూరి(Pani Puri), పేరు ఏదైనా కావొచ్చు.. కానీ ఈ స్నాక్ ఐటెంను పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. ఈ స్ట్రీట్ ఫుడ్ ని ఎక్కువ మంది ఇష్టంగా తినే ఆహారం. ముఖ్యంగా అమ్మాయిలు పానీ పూరీకి పెద్ద ప్రేమికులని చెప్పవచ్చు. అయితే  ఓ బండి మీద చిరు వ్యాపారి.. పూరీని అమ్మడం ఇప్పటి వరకూ అందరి తెలిసిందే. కర కరలాడే చిన్నపాటి పూరీలను మధ్యలో రంధ్రం చేసి అందులో బంగాళాదుంప మసాలా ను పానీలో ముంచుకుని ఆరగిస్తారు. ఈ మసాలాను, పానీ ని విడిగా తయారు చేస్తారు. అయితే తాజాగా ఇష్టమైన పానీపూరీ పెళ్లిళ్లు, ఫంక్షన్లలో కూడా ఓ ఫుడ్ ఐటెం గా అలరిస్తుంది.  అతిధులు ఈ గోల్ గప్పను ఆస్వాదించడానికి క్యూలు కడతారు. ఈ స్ట్రీట్ ఫుడ్ ను తినడానికి పెళ్లిళ్ల  గోల్‌గప్పాస్‌ స్టాల్స్‌ దగ్గర రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు కూడా పెళ్లిళ్లలోనో, పార్టీల్లోనో ఎంజాయ్ చేయడానికి పానీ పురీ కోసం వెయిట్ చేస్తుంటే, ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు. ఇంకా చెప్పాలంటే.. పానీ పురీ తినడానికి ఒక్కసారి ఆలోచిస్తారు కూడా..

వైరల్ అవుతున్న ఈ వీడియో పెళ్లికి సంబంధించినది లేదా ఏదైనా ఫంక్షన్‌లో చిత్రీకరించి ఉంటుంది. ఈ వీడియోలో  పానీ-పూరీ సర్వ్ చేసే వ్యక్తి తన స్టాల్‌లో ఉన్నట్లు కనిపించలేదు. అయితే అతిథుల ప్లేట్ లో పానీ పూరీలను చిన్న చిన్న పిల్లలు సర్వ్ చేస్తున్నారు. చిన్న పిల్లలు పానీ పూరీ స్టాల్ కి వచ్చిన అతిథులందరికీ తమదైన శైలిలో గోల్గప్పలు తినిపిస్తున్నారు. ఈ ఫంక్షన్‌లో పానీపూరీ డిమాండ్‌ను తీర్చడానికి బాలల సైన్యం సిద్ధంగా ఉంది.  అయితే ఈ చిన్నారులు చేతులకు గ్లౌజులు వేసుకోలేదు.. సరికదా.. మురికి చేతులతో పూరీలను తయారు చేస్తూ.. వాటిని నీటిలో ముంచుతూ.. స్టాల్స్ వద్దకు వచ్చిన పానీ పురీ లవర్స్ కు సర్వ్ చేస్తున్నారు. చిన్నారులు ఉన్న తీరుని చూసి ఫంక్షన్‌కు వచ్చిన అతిథులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ వీడియోను ఘంటా అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ షేర్ చేసింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వీడియో మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. వెలది నెటిజన్ల కామెంట్స్ ను సొంతం చేసుకుంది. ఇది చూస్తే పార్టీలకు వెళ్లడం మానుకోవాలనిపిస్తుంది అని చాలా మంది అన్నారు.  అంతేకాదు ‘ఈ గోల్గప్పను ఎవరు తింటారో వారు ఖచ్చితంగా చిరంజీవులు అవుతారని వ్యాఖ్యానించారు.  అదే సమయంలో, మరొక వినియోగదారుడు.. ‘ఈ గోల్గప్పా తిన్న తర్వాత, కరోనా మహమ్మారి కూడా మీకు హాని కలిగించదంటూ తనదైన శైలిలో కామెంట్ చేశారు. ‘పెళ్లిలో స్టఫ్డ్ ఫుడ్ తినే అతిథులకు ఇది తినిపించాలి… మళ్ళీ ఎప్పుడూ పానీ పూరీ వైపు చూడరు అంటూ ఇంకొందరు వ్యాఖ్యానించారు.

Also Read:

చెర్రీ, శంకర్ మూవీకి లీకుల బెడద..తాజా లుక్‌లో తండ్రిని తలపిస్తున్న తనయుడు..రుద్రవీణ ఫ్లేవర్ అంటూ టాక్