
సోషల్ మీడియాలో పాముల వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతాయి. నెట్టింట విస్తృతంగా లైకులు, షేర్లు అవుతున్నాయి. కొన్నిసార్లు, కొంతమంది పిచ్చి వ్యక్తులు పాములతోనూ వెకిలీ చేష్టాలకు పాల్పడుతుంటారు. వాటిని జోక్‌గా తీసుకుని ప్రాణాలను రిస్క్‌లో పెడుతుంటారు. మరికొందరు విషపూరిత పాములతో ప్రమాదకరంగా ఫైట్ చేస్తుంటారు. నాగుపాములను కూడా ఎగతాళి చేసే చాలా మంది తమను తాము హీరోలుగా పోల్చుకుంటారు. అలాంటి వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ సిరీస్‌లో ఒక కొత్త వీడియో కనిపించింది. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్నారు. వారిలో వెనుక కూర్చున్న వ్యక్తి ఒక చేతిలో భారీ పొడవైన పామును పట్టుకుని ఉన్నాడు. కారులో వారి వెనుక వస్తున్న వారు ఇదంతా వీడియో తీశారు.
వైరల్ వీడియోలో ఇద్దరు వ్యక్తులు బైక్ నడుపుతున్నారు. బైక్ డ్రైవర్ వెనుక కూర్చున్న వ్యక్తి చేతిలో పామును పట్టుకుని ఉన్నాడు. బైక్ వేగంగా వెళుతుండగా, వెనుక కూర్చున్న వ్యక్తి తన చేతిలోని పాము తోకను పట్టుకుని కిందకు వేలాడదీసుకుని వెళ్తున్నాడు. ఆ సమయంలో పాము పదే పదే అతనిపై దాడి చేసేందుకు చూసింది. కానీ, అతను పాము నోటికి తగలకుండా తృటిలో తప్పించుకోవడం వీడియోలో చూపిస్తుంది. బైక్‌ను వెంబడిస్తున్న కారులో ఉన్న ఒక మహిళ ఈ సంఘటనను కెమెరాలో బంధించింది.
వీడియో ప్రకారం.. కారులో వెళ్తున్న ఆ మహిళ బైకర్‌ను చూసి షాక్ అవుతుంది. వారి చేతిలో ఉన్నది పాము అని చెప్పింది. ఆ తర్వాత ఆమె బైకర్ ని ఏం చేస్తున్నావు?అని అడుగుతుంది. కారు బైక్ దగ్గరికి రాగానే, బైకర్ ఆపుతాడు. పామును పట్టుకున్న వ్యక్తి బండి దిగి అడవి వైపు నడవడం ప్రారంభిస్తాడు. అలా కొంతదూరం లొపలికి వెళ్లిన తర్వాత, అతను పామును పొదలలోకి వదిలేశాడు. అతను పామును వదలడానికి వెళ్ళినప్పుడు, పాము కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ, ఆ వ్యక్తి దానిని తోసివేస్తాడు. ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..