Owlets Viral Pictures: అందమైన ప్రేమ పక్షుల ప్రీ వెడ్డింగ్ షూట్.. ఫోటోలు చూస్తే వావ్ అంటారు..!

|

Jan 21, 2022 | 1:35 PM

Owlets Viral Pictures: గుడ్లగూబ అనగానే చాలా మంది భయపోతుంటారు. దానిని చెడు శకునంగా భావిస్తుంటారు.

Owlets Viral Pictures: అందమైన ప్రేమ పక్షుల ప్రీ వెడ్డింగ్ షూట్.. ఫోటోలు చూస్తే వావ్ అంటారు..!
Follow us on

Owlets Viral Pictures: గుడ్లగూబ అనగానే చాలా మంది భయపోతుంటారు. దానిని చెడు శకునంగా భావిస్తుంటారు. కానీ జంతు, పక్షి ప్రేమికుల కళ్లకు మాత్రం అవి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. అవును, ప్రేమతో చూస్తే ఏదైనా అద్భుతంగానే కనిపిస్తుంటుంది. ఇదంతా అటుంచితే.. తాజాగా రెండు గుడ్లగూబ లకు సంబంధించి ఓ బ్యూటీఫుల్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ఈ వైరల్ ఫోటోలను ఐఎఫ్‌ఎస్ అధికారి మధు మితా తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో రెండు గుడ్లగూబలు ఒక కొమ్మపై ప్రశాంతంగా కూర్చుని ఒకదానితో ఒకటి దోబూచులాడుకుంటున్నాయి. ప్రేమగా సరసాలాడుతున్నాయి. ఇలా గుడ్లగూబలు సంతోషంగా ఉండటాన్ని కెమెరాతో క్లిక్ మనిపించారు కెమెరామెన్. చూడటానికి వాటి జంట ఎంతో అందగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని భండారా ప్రాంతంలో ఈ గుడ్లగూబ ఫోటోలను తిశారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యూజర్ ‘‘ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అనుకుంటా!’’ అంటూ క్యాప్షన్ పెట్టారు.

సోషల్ మీడియాలో ఈ ఫోటోలను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అందమైన ఈ పక్షి జంటను చూస్తుంటే ముచ్చటేస్తోందంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ గుడ్లగూబల ఎంత మనోహరంగా ఉన్నాయో అని మరికొందరు మంత్రముగ్దులైపోతున్నారు. పక్షుల్లో కూడా భావోద్వేగాలు ఉంటాయని, ఈ ఫోటోలు హృదయాన్ని కదిలిస్తున్నాయని పేర్కొంటున్నారు.

Also read:

Nirmala Sitaraman: నిర్మలమ్మ బడ్జెట్‌కు తుది మెరుగులు.. నాలుగోసారి తెలుగింటి కోడలు ఘనత

Budget 2022: గృహ కొనుగోలుదారులకు కేంద్రం శుభవార్త.. రుణ చెల్లింపులపై పన్ను మినహాయింపు..!