Viral News: కొంప ముంచిన బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్.. ఓపెన్ చేసి చూస్తే షాక్..!

| Edited By: Basha Shek

Sep 27, 2022 | 7:42 PM

బిగ్ బిలియన్ డేస్ సేల్ నా కొంప ముంచిందంటున్నాడు ఓప్రముఖ ఆన్ లైన్ కస్టమర్. ల్యాప్‌టాప్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్‌లో ఆర్డర్ చేశాడు. తీరా డెలివరీ అయ్యాకా ఆ బాక్సు ఓపెన్ చేసి చూసి షాకవడం

Viral News: కొంప ముంచిన బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్.. ఓపెన్ చేసి చూస్తే షాక్..!
Big Billion Days Sale
Follow us on

Viral News: ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ (Online Shopping Sites) అందుబాటులోకి వచ్చిన తర్వాత.. షాపింగ్ ఎంత ఈజీగా జరుగుతుందో.. అంటే ఎక్కువగా ప్రజలు గందరగోళానికి గురవుతున్న సంఘటలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాము ఒక వస్తువు ఆర్డర్ చేస్తే.. డెలివరీ మరొక వస్తువు అయిందంటూ తరచుగా వినియోగదారులు తమ కష్టాలను, నష్టాన్ని సోషల్ మీడియా (Social Media) వేదికగా వెల్లడిస్తునే ఉంటారు. తాజాగా ఒక కస్టమర్ ల్యాప్‌టాప్‌ను ఆర్డర్ చేస్తే సబ్బు వచ్చిందంటూ పేర్కొన్నాడు. అవును పండగ సందర్భంగా కస్టమర్స్ ను ఆకట్టుకోవడానికి తమ బిజినెస్ ను పెంచుకోవడానికి అనేక ఆన్ లైన్ సైట్స్ బంపర్ ఆఫర్స్ ను ప్రకటించాయి. అయితే బిగ్ బిలియన్ డేస్ సేల్ నా కొంప ముంచిందంటున్నాడు ఓప్రముఖ ఆన్ లైన్ కస్టమర్. ల్యాప్‌టాప్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్‌లో ఆర్డర్ చేశాడు. తీరా డెలివరీ అయ్యాకా ఆ బాక్సు ఓపెన్ చేసి చూసి షాకవడం మా కుటుంబం వంతయ్యిందని వాపోతున్నాడు. లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో అతను మొత్తం కష్టాలను వివరించాడు

యశస్వి శర్మ అనే వ్యక్తి బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆర్డర్ డెలివరి సమయంలో ఓపెన్ బాక్సు కాన్సెప్ట్ తనకు తెలియదని.. పేర్కొన్నారు. ఓపెన్-బాక్స్ అంటే అతను ల్యాప్‌టాప్‌ని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే డెలివరీ బాయ్‌కి OTP ఇవ్వాలి. ఈ విషయం  తెలియకపోవడంతో డెలివరి బాయ్ ఇచ్చిన బాక్సు తీసుకుని అతడికి ఓటీపీ చెప్పి పంపించేశారు. దీంతో డెలివరీ బాయ్ ఆ ఓటీపీని స్వీకరించి బాక్స్ తెరచి చూడకుండా వెళ్ళిపోయాడు.

అయితే తీరా ల్యాప్‌టాప్ బాక్సు ఓపెన్ చేసి చూస్తే.. అందులో ల్యాప్‌టాప్‌కి బదులుగా ఘడి బట్టల సబ్బులు ఉన్నాయని యశస్వి శర్మ వాపోయాడు. డెలివరీ బాయ్ బాక్స్ తనిఖీ చేయకుండా వచ్చి వెళ్లినట్లు నా వద్ద CCTV ప్రూఫ్ ఉంది. డెలివరి బాయ్ వచ్చి, వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అతడి ముందు ల్యాప్‌టాప్ బాక్సు ఓపెన్ చేయలేదు. ఆ విషయాన్ని సీసీటీవీ దృశ్యాలతో సహా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కి ఫిర్యాదు చేసినప్పటికీ.. వాళ్లు కూడా తనదే తప్పని నిందవేశారని పేర్కొన్నారు. ఈ విషయం తనను చాలా విస్మయానికి గురిచేస్తోందని యశస్వి శర్మ చెప్పుకొచ్చాడు. తాను ఫ్లిప్‌కార్డ్ చేతిలో ఎలా మోసపోయానన్న మొత్తం వైనాన్ని యశశ్వి శర్మ సోషల్ మీడియా వేదికగా పోస్టులో పేర్కొన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యశస్వి శర్మ పోస్ట్ వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఏది ఏమైప్పటికీ, Flipkart సీనియర్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఈ విషయంపై స్పందిస్తూ.. ల్యాప్ టాప్ ఇవ్వడం అసాధ్యమని చెప్పారు. డెలివరీ సమయంలో ల్యాప్‌టాప్‌ని తనిఖీ చేయకుండా OTP ఇవ్వకూడదన్నారు. ఈ విషయంపై ఇదే తమ చివరి స్పందన.. ఇక నుంచి ఈ విషయం తాము ఏ విధంగా స్పందించమని స్పష్టం చేశారు.

Big Billion Days Sale Viral

ఫ్లిప్‌కార్ట్‌ వివరణ ఏంటంటే?

కాగా ఈ ఘటనపై ఫ్లిప్‌కార్ట్‌ యాజమాన్యం స్పందించింది. తమ కస్టమర్ల నమ్మకాన్ని ప్రభావితం చేసే ఎలాంటి ఘటలనైనా సహించబోమని పేర్కొంది. ‘మాకస్టమర్లకు సాధ్యమైనంత ఉత్తమ ఆన్‌లైన్‌ షాపింగ్‌ అనుభవాన్ని అందించడమే మాకు ముఖ్యం. వారి హక్కులను కాపాడడం కోసమే ఓపెన్‌ బాక్స్‌ డెలివరీ సదుపాయాన్ని తీసుకొచ్చాం. ఇందులో కస్టమర్ల ముందే డెలివరీ బాయ్‌ పార్శిల్‌ బాక్స్‌ను ఓపెన్‌ చేస్తాడు. తమ ఆర్డర్‌ కరెక్టుగా ఉందని తెలిసిన తర్వాతే కస్టమర్‌ తమ ఓటీపీని షేర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కస్టమర్లపై ఎలాంటి ఆర్థిక భారాన్ని మోపదు. ఇక ల్యాప్‌ట్యాప్‌ ఘటనలో సంబంధిత కస్టమర్‌ పార్శిల్ బాక్స్‌ను చూడగానే ఓటీపీని షేర్‌ చేసుకున్నాడు. అయితే ఈ ఘటనపై మేం విచారణ చేపట్టాం. మా కస్టమర్ సేవా బృందంతో మాట్లాడి అతను చెల్లించిన డబ్బులు తిరిగి ఇస్తాం. 3-4 పని రోజులలో మనీ కస్టమర్‌కు క్రెడిట్ చేయబడుతుంది. అలాగే ఈ ప్యాకింగ్‌ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని వివరణ ఇచ్చింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..