Vijay Mallya – Lalit Modi: ఇద్దరూ ఇండియాకు మోస్ట్ వాంటెడ్.. విలాసాల్లో లండన్ బాబులు

|

Jun 24, 2024 | 8:16 PM

ఆ ఇద్దరూ ఇండియాకు మోస్ట్ వాంటెడ్.. బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టారు. వ్యవస్థలు అరెస్ట్ చేసే సమయానికి అందరి కళ్లు గప్పి లండన్ చెక్కేశారు. దేశం వదిలి వెళ్లినప్పటి నుంచి దర్జాగా లండన్లో ఎంజాయ్‌ చేస్తున్నారు . ఆ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి...

Vijay Mallya - Lalit Modi: ఇద్దరూ ఇండియాకు మోస్ట్ వాంటెడ్.. విలాసాల్లో లండన్ బాబులు
Lalit Modi - Vijay Mallya
Follow us on

ఒకప్పటి ఇండియన్‌ లిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏడాదికి పైగా డేటింగ్లో ఉన్న సిద్ధార్థ మాల్యా, జాస్మిన్ల నిశ్చితార్థం గతేడాది నవంబర్లో జరిగింది. తాజాగా లండన్లో వీరి వివాహం కొంతమంది సన్నితుల సమక్షంలో జరిగింది. పరారీలో ఉన్న మాజీ ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) చీఫ్ లలిత్ మోదీ.. ఇటీవల లండన్లో జరిగిన విజయ్ మాల్యాకు కొడుకు ‘సిద్ధార్థ మాల్యా’ వివాహంలో కనిపించారు. లండన్లోని హెర్ట్ ఫోడ్ ఫైర్‌లో విజయ్ మాల్యాకు చెందిన ఎస్టేట్లో జరిగిన వివాహ వేడుకలో లలిత్ మోదీ ప్రత్యక్షమయ్యారు. విజయ్‌ మాల్యా, లలిత్ మోదీ ఇద్దరూ ఇండియాలో ఆర్థిక నేరస్థులుగా కేసులు ఎదుర్కొంటున్నారు.

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా… యునైటెడ్ బ్రూవరీస్‌, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌ కంపెనీలతో ఒకప్పుడు ఇండియాలో ఒక వెలుగు వెలిగిన వ్యాపార దిగ్గజం. పేరుకు తగ్గట్టుగానే కింగ్ సైజ్‌ లైఫ్‌ ఎంజాయ్ చేసిన విజయ్‌ మాల్యా జీవితం వ్యాపారాలలో నష్టాలతో తలకిందులైంది. దేశంలోని 17 బ్యాంకులను బురిడీ కొట్టించాడు విజయ్ మాల్యా. తన సంస్థల పేరు మీద దాదాపు రూ.9000కోట్లను అప్పుగా వాడి… కంపెనీ నష్టాల్లో ఉందంటూ కింగ్ ఫిషర్ మూసేశారు. బ్యాంకులను నిలువునా ముంచారు. బ్యాంకులు విజయ్ మాల్యా దేశం దాటి పోనీయకుండా చూడండి అంటూ సుప్రీం కోర్టుకు వెళ్లాయి. కానీ ఏం ఫలితం… ఆయన అప్పటికే దేశం దాటేశాడు. ఇండియన్ బ్యాంకులకు దాదాపు 900 కోట్లు ఎగ్గొట్టడంతో ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి.

ఏజెన్సీలు అరెస్ట్ చేసే సమయానికి అంటే మార్చ్‌2, 2016 నాటికే చాకచక్యంగా విజయ్‌ మాల్యా కుటుంబంతో సహా లండన్ పారిపోయాడుకుమారుడు. లండన్ వెళ్లిప్పటి నుంచి అక్కడే ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తున్న విజయ్‌ మాల్యా తాగాజా కుమారుడు సిద్ధార్థ్‌ మాల్యా పెళ్లి చేశారు. ఈ వివాహ వేడుకకు హాజరై న అతిథులలో IPL మాజీ చీఫ్ లలిత్ మోడీ ఉన్నారు.

IPL మాజీ చీఫ్ లలిత్ మోడీ కూడా ఇండియాలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాడు. 2008లో, ట్వంటీ 20 క్రికెట్ ఆధారంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభించడంలో లలిత్ మోడీ కీలక పాత్ర పోషించారు . టీ20 క్రికెట్ కి విపరీతమైన క్రేజ్‌ ‌తీసుకొచ్చాడు. తర్వాత కాలంలో పన్ను ఎగవేత, మనీలాండరింగ్ తో పాటు ఐపిఎల్‌తో ప్రాక్సీ యాజమాన్యం వంటి ఆరోపణల మధ్య 2010లో లలిత్ మోడీ దేశం విడిచిపెట్టాడు. అతను భారతదేశానికి తిరిగి రావడానికి నిరాకరించాడు, అండర్ వరల్డ్ నుండి హత్య బెదిరింపులు ఉన్నాయని ఆరోపించాడు. అయితే అప్పటి నుంచి లలిత్ మోడీ లండ‌న్‌లోనే ఉంటున్నాడు. ఆ మధ్య బాలీవుడ్ నటి సుష్మితా సేన్‌తో లలిత్ మోడీ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత యేడాది లండన్‌లో జరిగినభారత మాజీ సొలిసిటర్‌ జనరల్ హరీష్ సాల్వే మూడవ వివాహానికి సైతం లలిత్ మోడీ మాజరయ్యాడు.

ఇలా ఇండియాలో బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టి దర్జాగా లండన్ లో ఎంజాయ్ చేస్తున్న విజయ్‌ మాల్యా, లలిత్ మోదీ వంటి ఆర్థిక నేరస్థులు అప్పుడప్పుడు వివాహ వేడుకల్లో దర్శనమిస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…