Viral Video: దారుణం.. ఇంట్లో దూరిన వీధి కుక్కులు.. పెంపుడు కుక్కను ఎలా చంపాయో చూడండి.. షాకింగ్‌ వీడియో

Viral Video: సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే దారుణంగా ఉంటాయి. కొన్ని హృదయాలను కదిలించే వీడియోలు ఉంటే.. మరి కొన్ని షాకింగ్‌కు గురి చేసేలా ఉంటాయి. అలాంటి ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది..

Viral Video: దారుణం.. ఇంట్లో దూరిన వీధి కుక్కులు.. పెంపుడు కుక్కను ఎలా చంపాయో చూడండి.. షాకింగ్‌ వీడియో

Updated on: Aug 02, 2025 | 10:54 AM

ఓ ఇంట్లో దూరిని వీధి కుక్కులు పెంపుడు కుక్క పిల్లను ఎంత దారుణంగా చంపాయో ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని మహల్‌గావ్‌లో ఒక పెంపుడు కుక్కపై వీధికుక్కలు దాడి చేసి చంపిన బాధాకరమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటన CCTVలో రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రజలలో ఆగ్రహాన్ని సృష్టిస్తోంది. ఈ వీడియో వీధికుక్కల పెరుగుతున్న సమస్య, దాని ప్రమాదకరమైన పరిణామాలను మరోసారి హైలైట్ చేసింది.

వైరల్ వీడియోలో ఒక ఇంట్లో జరిగిన సంఘటనగా కనిపిస్తుంది. ఇక్కడ మూడు వీధి కుక్కలు దూరి ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క పిల్లపై దారుణంగా దాడి చేశాయి. వీధి కుక్కలు పెంపుడు కుక్క పిల్ల చుట్టుముట్టి కనికరం లేకుండా కరవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. పెంపుడు కుక్క తప్పించుకోవడానికి ప్రయత్నించినా చివరకు ప్రాణాలు వీడిచింది.

ఇవి కూడా చదవండి

గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్, జంతు సంక్షేమ సంస్థలు ఈ విషయంపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఇటువంటి సంఘటనలను నివారించడానికి మున్సిపల్ కార్పొరేషన్ వీధికుక్కలకు టీకాలు వేసే ప్రచారాన్ని వేగవంతం చేయాలంటున్నారు.

ఇది కూడా చదవండి: ఇది కూడా చదవండి: Traffic Challans: గుడ్‌న్యూస్‌.. మీ వాహనంపై చలాన్లు ఉన్నాయా? సగం డబ్బులు మాఫీ!

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి