Viral Video: నీళ్లు తాగుతున్న జింకలు.. ఇంతలో అక్కడికి అనుకోని అతిథి.. ఊహించని సంఘటన

|

Jul 05, 2022 | 5:32 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం చిన్నదైపోయింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన అది క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చూడటానికి నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు

Viral Video: నీళ్లు తాగుతున్న జింకలు.. ఇంతలో అక్కడికి అనుకోని అతిథి.. ఊహించని సంఘటన
Deer
Follow us on

Viral Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం చిన్నదైపోయింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన అది క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చూడటానికి నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. అడవిలో జంతువుల జీవితం గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి దీనికి కారణం. ఇప్పుడుచిరుత, జింక లకు సంబంధించిన  వీడియో ఒకటి మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ వీడియో చూసి జనాలు షాక్ అవుతున్నారు. మాములుగా జింకను చూస్తే చిరుత వెంటనే దాడి చేస్తుంది. దాన్ని పరిగెత్తించి మరి చంపి తింటుంది. కానీ ఇక్కడ ఊహించని సంఘటన జరిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవవడమే కాదు రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇంతకు ఎం జరిగిందంటే..

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో మనల్ని కడుపుబ్బా నవ్వించే వీడియోలు చాలా ఉన్నాయి. కొన్ని వీడియోలు మిమ్మల్ని నవ్విస్తే, కొన్ని మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి, భయపెడతాయి, ఆశ్చర్యపరుస్తాయి. అయితే ఈ వీడియో ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియోలో ఓ నీటి కొలను దగ్గరికి రెండు  జింకలు వచ్చి నీళ్లు తాగడం మొదలు పెట్టాయి. ఇంతలో అక్కడికి ఒక చిరుత వచ్చింది. అయితే ఆ చిరుత జింకలను వేటాడకుండా నీళ్లు తాగి అక్కడి నుంచి వెళ్లిపోయింది. జింకలు చాలా దగ్గరగా ఉన్నా.. ఆ చిరుత ఏమి చేయకుండా నీళ్లు తాగడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వైరల్ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి