Viral Video: నాలుగు కాళ్లతో పుట్టిన కోడిపిల్ల.. నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది… అరుదైన దృశ్యం మిస్‌ కావొద్దు.

|

Dec 30, 2022 | 4:56 PM

ఇప్పటివరకు మీరు 2 కాళ్ల కోళ్లను మాత్రమే చూసి ఉంటారు. కానీ, ఇది ఓ అద్భుతం. దీన్ని నమ్మడం అంత తేలిక కాదు. నాలుగు కాళ్లతో ఇటీవలే పుట్టిన కోడి పిల్లను ఓ వ్యక్తి తన మొబైల్ కెమెరాలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

Viral Video: నాలుగు కాళ్లతో పుట్టిన కోడిపిల్ల..  నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది... అరుదైన దృశ్యం మిస్‌ కావొద్దు.
Four Legged Chicken
Follow us on

సోషల్ మీడియాలో ప్రతినిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అయితే కొన్ని వీడియోలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేకుండా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు ఆశ్చర్యంగా ఉంటే, మరికొన్ని వీడియోలు ఆసక్తి కరంగా ఉంటాయి. కొన్ని వీడియోలు షాకింగ్‌గా కూడా ఉంటాయి. ముఖ్యంగా జంతువులు, పక్షులు, పాములు, కుక్కలు, పిల్లలు, చిన్నపిల్లలు, కోడి పిల్లలకు సంబంధించిన అనేక రకాల వీడియోలు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. అయితే, ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వీడియో భిన్నమైనది. ఎందుకంటే, ఇప్పటివరకు మీరు 2 కాళ్ల కోళ్లను మాత్రమే చూసి ఉంటారు. కానీ, ఇది ఓ అద్భుతం. దీన్ని నమ్మడం అంత తేలిక కాదు. నాలుగు కాళ్లతో ఇటీవలే పుట్టిన కోడి పిల్లను ఓ వ్యక్తి తన మొబైల్ కెమెరాలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దాంతో ఇప్పుడా వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తన చేతులతో నాలుగు కాళ్లతో ఉన్నకోడిపిల్లను చూపిస్తున్నాడు. సాధారణంగా ఇలాంటి వింత ఆకారంలో పుట్టిన కోడిపిల్లలు ఎక్కువ కాలం బ్రతకవు. కానీ, ఈ కోడిపిల్ల పూర్తి ఆరోగ్యంగా ఉంది. ఆ వ్యక్తి కోడిపిల్ల తల్లి కోడితో సహా ఇతర కోళ్లను కూడా వీడియోలో చూపించాడు.

ఇవి కూడా చదవండి

పైగా అతడు, ఈ కోడిపిల్ల పెద్దయ్యాక వీడియో తీసి మళ్లీ చూపిస్తానని కూడా ఆ వ్యక్తి చెప్పాడు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వీడియో చూసిన జనాలు నమ్మలేకపోతున్నారు.


@saquib12pathans అనే వినియోగదారు ఈ వీడియోను Instagramలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోకు నాలుగు కాళ్ల కోడిపిల్ల అనే టైటిల్ పెట్టారు. ఈ వీడియోపై చాలా మంది స్పందించారు. వందల కొద్దీ లైక్‌లు, కామెంట్‌లు వచ్చాయి. ఇది అద్భుతంగా ఉంది. కోడికి నాలుగు కాళ్లు ఎలా ఉన్నాయని కొందరు అడుగుతుంటే, ఇది నమ్మశక్యంగా లేదని మరి కొందరు కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.