
Viral Video: స్నేహం.. ప్రపంచంలో ప్రేమించని మనిషి ఉంటాడేమో కానీ.. స్నేహం చేయని మనిషి ఉండరు. ఈ లోకంలో అన్ని బంధాలను దేవుడే ఇస్తాడు.. కానీ స్నేహితుడిని మాత్రం మనే ఎంచుకోవాలని అంటుంటారు. ఎవరో చెప్పినట్టు..’ ఒక్కసారి స్నేహం చేస్తే ఇక దాంపత్యమే స్నేహం చేసిన తర్వాత ఎదుటివారిలో చాలా తప్పులు కనిపిస్తాయట.. వీలైతే తప్పు అని చెప్పాలి లేకుంటే భరించాలి’. అయితే అన్ని స్నేహబంధాల సవ్యంగా ఉండవు. కొంతమంది నమ్మిన స్నేహితుడికి వెన్నుపోటు పొడుస్తారు. స్నేహితుడి చేతిలో దారుణంగా మోసపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అది స్నేహం తప్పు కాదు ఎంచుకున్న స్నేహితుడి తప్పు. అయితే నమ్మక ద్రోహం చేసే స్నేహితులు మనుషుల్లోనే కాదు. జంతువుల్లో, చిన్న చిన్నప్రాణుల్లోనూ ఉంటాయి. అందుకు సాక్షమే ఈ వీడియో..
ఈ వీడియోలో మూడు చీమలు.. కలిసి ఎక్కడికో వెళ్తున్నాయి.. దారిలో ఓ ఆకు పైకి ఎక్కాల్సి వచ్చింది. దాంతో చీమలు ఒకదానిపై ఒకటి ఎక్కి పైకి చేరుకున్నాయి. అయితే అవి పైకి ఎక్కడనికి సహాయం చేసిన మూడో చీమను మాత్రం అవి పైకి ఎక్కినా తర్వాత పట్టించుకొలేదు. పైకి వెళ్లిన తర్వాత అవి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. తనకు ఆ రెండు చీమలు సాయం చేస్తాయని భావించిన ఈ చీమ ఆలా వాటికోసం ఎదురుచూస్తూ ఉండిపోయింది. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చీమల్లోనూ నమ్మక ద్రోహం ఉంటుంది అని ఈ వీడియో నిరూపంచింది అని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. ఈ వీడియో కన్నీరు తెప్పిస్తుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఆ అమాయక చీమ నమ్మక ద్రోహం జరిగిందని అంటున్నారు నెటిజన్లు.. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :