Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెట్టండి.. గుర్తిస్తే మీ కళ్లలో మెరుపున్నట్లే..!

| Edited By: Anil kumar poka

Apr 07, 2022 | 8:30 AM

Photo Puzzles: పని ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది పజిల్స్‌, సుడోకోల బాట పడతారు. వీకెండ్ బుక్స్, మ్యాగజైన్స్‌లో వచ్చే వివిధ రకాల పజిల్స్‌‌ను పరిష్కరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెట్టండి.. గుర్తిస్తే మీ కళ్లలో మెరుపున్నట్లే..!
Photo Puzzle
Follow us on

Photo Puzzles: పని ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది పజిల్స్‌, సుడోకోల బాట పడతారు. వీకెండ్ బుక్స్, మ్యాగజైన్స్‌లో వచ్చే వివిధ రకాల పజిల్స్‌‌ను పరిష్కరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలా ఇప్పుడు నెట్టింట్లో కూడా వివిధ రకాల పజిల్స్ మన ఆలోచనా సామర్థ్యానికి పదును పెడుతున్నాయి. ముఖ్యంగా ఫొటో పజిల్స్‌ (Photo Puzzles) సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. వీటిని పరిష్కరించాలంటే.. మెదడుకే కాదు కళ్లకు కూడా పని చెప్పాల్సిందే. దీంతో పాటు కొంచెం ఓపిక కూడా తెచ్చుకోవాల్సిందే. ఇక సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ కంటూ కొన్ని ప్రత్యేక పేజీలు ఉన్నాయి. కొన్నిసార్లు పాత ఫొటో పజిల్స్ సైతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. అలా తాజాగా ఓ ఫొటో పజిల్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. ఫొటోను చూస్తుంటే ఓ అటవీ ప్రాంతంలా కనిపిస్తోంది. నేలపై చిన్న చిన్న మొక్కలు, ఆకులు ఉన్నాయి. వీటి మధ్యనే ఓ విషసర్పం నక్కి ఉంది. దీనిని గుర్తించేందుకు నెటిజన్లు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది మొదటి ప్రయత్నంలోనే పామును కనిపెట్టేయగా.. మరికొందరు పజిల్‌ను సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. మరి మీరు కూడా ఓసారి ట్రై చేయండి. సమాధానం దొరక్కపోతే కింద ఫొటోను చూడండి.
Also Read:White Hair Remedies: తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు అద్భుతమైన ఇంటి వైద్యం.. ఎలా ఉపయోగించాలంటే..White Hair Remedies: తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు అద్భుతమైన ఇంటి వైద్యం.. ఎలా ఉపయోగించాలంటే..

18 Pages: అందమైన ప్రేమ కథగా నిఖిల్ సినిమా.. ఆకట్టుకుంటున్న 18 పేజెస్ గ్లిమ్ప్స్..