Student Fight: ఇది సినిమా కాదు.. రియల్ ఫైటే! ఈ స్టూడెంట్స్ గలాటా చూస్తే మతి పోతుంది!!

|

Oct 14, 2021 | 2:59 PM

సినిమాల ప్రభావమో.. లాక్ డౌన్ సమయంలో ఇంటి వద్దనే ఉండి ఓటీటీలలో చూసిన సిరీస్ ల ప్రభావమో తెలీదు కానీ.. అదే రేంజిలో విద్యార్ధులు కొట్టుకున్నారు.

Student Fight: ఇది సినిమా కాదు.. రియల్ ఫైటే! ఈ స్టూడెంట్స్ గలాటా చూస్తే మతి పోతుంది!!
Students Fight
Follow us on

Student Fight: సినిమాల ప్రభావమో.. లాక్ డౌన్ సమయంలో ఇంటి వద్దనే ఉండి ఓటీటీలలో చూసిన సిరీస్ ల ప్రభావమో తెలీదు కానీ.. అదే రేంజిలో విద్యార్ధులు కొట్టుకున్నారు. ఎదో ఒకరిద్దరు పిల్లలు ఒకరితో ఒకరు దెబ్బలాడుకోవడం కాదు.. ఏకంగా రెండు స్కూల్స్ కి చెందిన విద్యార్ధులు ఒకరిపై ఒకరు కలబడి రణరంగం సృష్టించేశారు. ఈ సంఘటన కేరళలోని కోజికోడ్ లో చోటు చేసుకుంది. రెండు పాఠశాలలకు చెందిన విద్యార్థుల మధ్య చోటుచేసుకున్న వివాదం పెద్ద రచ్చగా మరి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కోజికోడ్ లోని కొడవల్లి వద్ద రెండు స్కూల్స్ కు చెందిన విద్యార్ధులు ఒకరిని ఒకరు గట్టిగా కొట్టుకున్నారు. విద్యార్ధులు పరీక్షలు రాసి వస్తున్నా సమయంలో ఈ ఘర్షణ జరిగింది.

కోజికోడ్‌లోని కరువన్‌పాయిల్ హయ్యర్ సెకండరీ పాఠశాలలోని ప్లస్ వన్ విద్యార్థులు కొడువల్లి హెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థుల మధ్య చిన్న సమస్య వచ్చింది. అది వాగ్వాదానికి.. అటు తరువాత కొట్లాటకు దారితీసింది. చివరకు రెండు స్కూళ్ళ విద్యార్ధులు వీధి పోరాటానికి దిగడంతో రచ్చ అయింది. రెండు పాఠశాలల విద్యార్థుల మధ్య విభేదాలు ఉన్నాయి . పాఠశాల అధికారులు పరీక్షలకు ముందు గొడవను నివారించడానికి ప్రయత్నించారు. వారు పాఠశాల ఆవరణలో ఎలాంటి గ్రూపు వివాదాలు జరగకుండా జాగ్రత్త పడ్డారు. వారి మధ్య తగువు పెద్దది కాకుండా నివారించడానికి కూడా ప్రయత్నించారు. దీంతో ఒక వర్గం స్టూడెంట్స్ తో ఘర్షణ కోసం ఇంకో వర్గం చుండాపురం వద్ద పరీక్షలు అయిన తరువాత కాచుకుని కూర్చున్నారు. రెండో వర్గం వారు వచ్చిన వెంటనే వారిపై దాడికి దిగారు. దీంతో ఘర్షణ పెద్ది అయింది.

ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు జోక్యం చేసుకుని ఇరు గ్రూపులను చెదరగొట్టారు. విద్యార్ధులను శాంతింప చేశారు. వారి మధ్య రాజీ చేశారు. కాగా, ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు పోలీసులకు చేరలేదు. దీంతో పోలీసులు కూడా ఎటువంటి కేసు బుక్ చేయలేదు. అయితే, ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా స్కూల్లో చదువుకోవలసిన పిల్లలు ఇలా రోడ్లమీద తన్నుకోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా విద్యార్ధుల తీరును తప్పుపడుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ వీడియో ఇక్కడ మీరూ చూడండి.

 

ఇవి కూడా చదవండి: IOCL Recruitment: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

Maa Elections 2021: మా ఎన్నికలల్లో మరో ట్విస్ట్‌.. బాలకృష్ణ ఇంటికి మంచు విష్ణు.. అసలేం జరుగుతోంది.