Viral Video: సూపర్‌హీరోకే చిక్కులు.. స్పైడర్‌మ్యాన్‌ను వెంటాడిన కుక్కలు..! వీడియో చూశారంటే నవ్వి నవ్వి పొట్ట చెక్కలే!

సాధారణంగా సినిమాల్లో స్పైడర్‌మ్యాన్ సూపర్‌హీరోగా అందరినీ కాపాడుతూ కనిపిస్తాడు. కానీ, నిజ జీవితంలో ఓ వ్యక్తి స్పైడర్‌మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకుని వీధిలో వెళ్తుండగా అనుకోని సంఘటన ఎదురైంది. విచిత్రమైన ఆ దుస్తులను చూసి కొన్ని వీధికుక్కలు అతనిపై దాడికి దిగాయి. దాదాపు 4 నుండి 5 కుక్కలు గుంపుగా అతని వెంటపడటంతో భయపడిపోయిన ఆ స్పైడర్‌మ్యాన్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశాడు. ఈ దృశ్యాన్ని వీడియో తీసిన వ్యక్తి కాపాడటం మర్చిపోయి నవ్వుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral Video: సూపర్‌హీరోకే చిక్కులు.. స్పైడర్‌మ్యాన్‌ను వెంటాడిన కుక్కలు..! వీడియో చూశారంటే నవ్వి నవ్వి పొట్ట చెక్కలే!
Spider Man Chased By Dogs

Updated on: Aug 18, 2026 | 2:44 PM

హాలీవుడ్ సూపర్‌హీరో స్పైడర్‌మ్యాన్ అనగానే అందరికీ కొండలను, భవనాలను సులువుగా ఎక్కుతూ, ప్రపంచాన్ని రాక్షసుల నుండి కాపాడే దృశ్యాలే గుర్తుకొస్తాయి. కానీ, మన నిజ జీవితంలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫన్నీ వీడియోను చూస్తే ఎవరైనా సరే నవ్వులు ఆపుకోలేరు. స్పైడర్‌మ్యాన్ వేషధారణలో ఉన్న ఒక వ్యక్తిని వీధికుక్కలు వెంటాడిన తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అసలు ఏం జరిగింది?

X వేదికగా @_CopAmir_ అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. వీడియోలో ఒక వ్యక్తి స్పైడర్‌మ్యాన్ రెడ్ అండ్ బ్లూ సూట్ ధరించి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే, ఆ వింత కాస్ట్యూమ్‌ను చూసి అక్కడ ఉన్న వీధికుక్కలకు ఏమనిపించిందో ఏమో కానీ, ఒక్కసారిగా అతడిపై దాడికి సిద్ధమయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఒక్కటి కాదు, రెండు కాదు.. ఏకంగా 4 నుంచి 5 కుక్కలు గుంపుగా అతని వైపు భౌభౌ అంటూ పరిగెత్తాయి. దాంతో సదరు స్పైడర్‌మ్యాన్ తన సూపర్‌హీరో పవర్స్ ఏవీ పనిచేయకపోవడంతో ప్రాణాలు దక్కించుకోవడానికి తీవ్రంగా పరుగులు తీశాడు. పరుగెత్తే తొందరలో అతను కిందపడిపోయినప్పటికీ, కుక్కలు మాత్రం అతని వదలకుండా మొరుగుతూనే ఉన్నాయి.

ఈ ఘటన అంతా జరుగుతుంటే అక్కడే ఉన్న ఒక వ్యక్తి సదరు స్పైడర్‌మ్యాన్‌ని కాపాడటానికి ప్రయత్నించకుండా, నవ్వుతూ వీడియో తీయడం విశేషం. ఈ వీడియోకు యూజర్ ఒక సరదా క్యాప్షన్ కూడా జత చేశాడు..ఒకప్పుడు స్పైడర్‌మ్యాన్ ప్రజలను కాపాడేవాడు.. కానీ, ఈ కాలపు స్పైడర్‌మ్యాన్ మాత్రం తనను తాను కూడా కాపాడుకోలేకపోతున్నాడు! అని.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో నవ్వుల ఈమోజీలతో రచ్చ చేస్తున్నారు. స్పైడర్‌మ్యాన్‌కు కూడా భయం ఉంటుంది అని నిరూపితమైంది! అని ఒకరు కామెంట్ చేయగా, మరోసారి ఆ వ్యక్తి స్పైడర్‌మ్యాన్ డ్రెస్ వేసుకునే సాహసం చేయడు అని మరొకరు రాసుకొచ్చారు. ఇలాంటి బట్టలు వేసుకుని రోడ్డుపైకి వస్తే కుక్కలు ఊరుకుంటాయా? అంటూ నెటిజన్లు సరదా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వేల సంఖ్యలో వ్యూస్ సాధిస్తూ నెటిజన్లకు కావలసినంత వినోదాన్ని అందిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us